వచ్చే ఏడాదీ కరోనా ఆంక్షలు కొనసాగించనున్న చైనా!

ABN , First Publish Date - 2021-06-23T04:33:50+05:30 IST

దేశంలోకి రాకపోకలపై విధిస్తున్న కరోనా ఆంక్షలను వచ్చే ఏడాది కూడా కొనసాగించేందుకు చైనా నిర్ణయించుకున్నట్టు తెలుస్తోంది.

వచ్చే ఏడాదీ కరోనా ఆంక్షలు కొనసాగించనున్న చైనా!

బీజింగ్: దేశంలోకి రాకపోకలపై విధిస్తున్న కరోనా ఆంక్షలను వచ్చే ఏడాది కూడా కొనసాగించేందుకు చైనా నిర్ణయించుకున్నట్టు తెలుస్తోంది. కొత్త వేరియంట్లతో ప్రమాదం ఉండొచ్చన్న అంచనాల నేపథ్యంలో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం. ఇతర దేశాలతో ఉన్న రవాణా సదుపాయాలపై చైనా ప్రభుత్వం ఇటీవల కాలంలో అనేక ఆంక్షలు విధించింది. దేశంలో కరోనా అదుపులోకి రావడంతో పాటూ ఇతర దేశాల్లో కొత్త వేరియంట్లు పుట్టుకువస్తుండటంతో అక్కడి ప్రభుత్వం ఆంక్షలు కొనసాగించేందుకు నిర్ణయించింది. మెయిన్ ల్యాండ్ చైనాకు వెళ్లాలనుకునే వారెవరైనా సరే ముందుగా వైద్య పరీక్షలు చేయించుకోవాల్సి ఉంటుంది. అంతేకాకుండా.. చైనాలో అడుగుపెట్టాక క్వారంటైన్‌లో రెండు వారాల పాటు గడపాల్సి ఉంటుంది. ఇది పూర్తి చేసుకున్నాకే ప్రయాణికులను తమ గమ్యస్థానాలకు అనుమతిస్తారు. 

Updated Date - 2021-06-23T04:33:50+05:30 IST