7.1 శాతం పెరిగిన చైనా రక్షణ బడ్జెట్

ABN , First Publish Date - 2022-03-08T20:38:21+05:30 IST

చైనా తన వార్షిక రక్షణ బడ్జెట్‌ను మరోసారి పెంచింది. 2022 ఆర్థిక సంవత్సరం రక్షణ బడ్జెట్‌ను ..

7.1 శాతం పెరిగిన చైనా రక్షణ బడ్జెట్

హాంగ్‌కాంగ్: చైనా తన వార్షిక రక్షణ బడ్జెట్‌ను మరోసారి పెంచింది. 2022 ఆర్థిక సంవత్సరం రక్షణ బడ్జెట్‌ను తాజాగా ప్రకటించింది. గత ఏడాది గంటే ఈ ఏడాది 7.1 శాతానికి రక్షణ బడ్జెట్‌ను పెంచుతూ 230 బిలియన్ డాలర్లకు చేర్చింది. 13వ నేషనల్ పీపుల్స్ కాంగ్రెస్ (ఎన్‌పీసీ) ఐదవ వార్షిక సమావేశం తొలిరోజు చైనా ఇందుకు సంబంధించిన ప్రకటన చేసింది.  రష్యా-ఉక్రెయిన్ మధ్య యుద్ధం నడుస్తున్న తరుణంలో  చైనా తాజా ప్రకటన ప్రాధాన్యం సంతరించుకుంది.


చైనా ప్రభుత్వం 2022 ఆర్థిక సంవత్సరానికి రక్షణ బడ్జెట్ కోసం 1.45 ట్రిలియన్ యువాన్ (230 బిలియన్ల అమెరికన్ డాలర్లు) ప్రతిపాదించింది. ఇది గత ఏడాది బడ్జెట్‌తో పోలిస్తే 7.1 శాతం అధికం. ఈనెల 5న చైనా పార్లమెంటుకు ఈ బడ్జె్ట్ ప్రతిపాదనలను సమర్పించారు. గత ఏడాది చైనా రక్షణ వ్యయం 200 బిలియన్ డాలర్లు అధిగమించింది. 2021లో చైనా తన రక్షణ వ్యయాన్ని అంతకు ముందు ఏడాది కంటే 6.8 శాతం పెంచింది. రెండేళ్ల క్రితం చైనా రక్షణ వ్యయాన్ని 6.6 శాతం పెంపుకే పరిమితం చేసింది. కోవిడ్ పరిస్థితి ఇందుకు ఒక కారణం. దీనికి ముందు సంవత్సరాల్లో 7.5 శాతం (2019), 8.1 శాతం (2018) పెంచింది. కేవలం సింగిల్ డిజిట్ శాతానికే చైనా డిఫెన్స్ బడ్జెట్‌ పరిమితం కావడం వరుసగా ఇది ఏడో సంవత్సరం. దేశ సార్వభౌమత్వాన్ని, భద్రతను, అభివృద్ధి ప్రయోజనాలను పరిరక్షించే లక్షంతో పీపుల్స్ లిబరేషన్ ఆర్మీని మరింత బలోపేతం చేయడంపైనే చైనా ప్రధానంగా దృష్టి సారిస్తూ వస్తోంది.

Updated Date - 2022-03-08T20:38:21+05:30 IST