సియోల్, డిసెంబరు 1: ఉత్తరకొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్‌తో పాటు ఆయన కుటుంబ సభ్యుల్లో కొందరు ప్రయోగదశలో ఉన్న చైనా వాక్సిన్‌ను వేయించుకున్నారని అమెరికాలోని సెంటర్ ఫర్ ది నేషనల్ ఇంట్ర్‌స్టకు చెందిన నిపుణుడు హ్యారీ కాజియానిస్ తెలిపారు. అలాగే, పలువురు ఉత్తరకొరియా అధికారులు కూడా వ్యాక్సిన్ వేయించుకున్నారని ఆయన వివరించారు. ఆ వ్యాక్సిన్ ఏ సంస్థకు చెందింది? అది సురక్షితమైందేనా? అన్న విషయాల గురించి తెలియరాలేదు. చైనాలోని ఏ వ్యాక్సిన్ వినియోగానికీ ఇప్పటివరకు ప్రపంచ ఆరోగ్య సంస్థ నుంచి అనుమతులు రాలేదు.