Chinaలో కొత్తగా బాలుడికి హెచ్3 ఎన్8 బర్డ్ ఫ్లూ మొదటి కేసు

ABN , First Publish Date - 2022-04-27T18:12:39+05:30 IST

ఏవియన్ ఫ్లూ() యొక్క హెచ్3 ఎన్8 జాతికి సంబంధించిన మొట్టమొదటి మానవ కేసు చైనా దేశంలో తాజాగా వెలుగు చూసింది...

Chinaలో కొత్తగా బాలుడికి హెచ్3 ఎన్8 బర్డ్ ఫ్లూ మొదటి కేసు

బీజింగ్ (చైనా): ఏవియన్ ఫ్లూ యొక్క హెచ్3 ఎన్8 జాతికి సంబంధించిన మొట్టమొదటి మానవ కేసు చైనా దేశంలో తాజాగా వెలుగు చూసింది.బర్డ్ ఫ్లూ కొత్త జాతి వైరస్ ప్రజల్లో వ్యాపించే ప్రమాదం తక్కువగా ఉందని ఆరోగ్య అధికారులు చెబుతున్నారు.ఈ జాతి బర్డ్ ఫ్లూ గుర్రాలు, కుక్కలు ,సీల్స్‌లలో సోకుతుందని తెలుసు, కానీ ఇంతకు ముందు మనుషుల్లో కనుగొనలేదని వైద్యులు చెబుతున్నారు.చైనాలోని సెంట్రల్ హెనాన్ ప్రావిన్స్‌లో నివసిస్తున్న నాలుగేళ్ల బాలుడు జ్వరం, ఇతర లక్షణాలతో ఈ నెల ప్రారంభంలో ఆసుపత్రిలో చేరాడు.ఆ బాలుడికి బర్డ్ ఫ్లూ హెచ్3 ఎన్8 పాజిటివ్ అని పరీక్షల్లో తేలిందని చైనా జాతీయ ఆరోగ్య కమిషన్ తెలిపింది.





బాలుడి కుటుంబం ఇంట్లో కోళ్లను పెంచిందని దీనివల్ల బాలుడు ఈ వ్యాధి బారినపడ్డారని వైద్యులు చెప్పారు.ప్రజలు చనిపోయిన లేదా జబ్బుపడిన పక్షులకు దూరంగా ఉండాలని ఆరోగ్యశాఖ అధికారులు సూచించారు. జ్వరం లేదా శ్వాసకోశ సమస్యలు ఏర్పడితే తక్షణమే చికిత్స పొందాలని ప్రజలను చైనా ఆరోగ్యశాఖ సూచించింది.


Updated Date - 2022-04-27T18:12:39+05:30 IST