కరోనా కోరల్లో చైనా.. ఒక్కరోజే 13వేల కేసులు

ABN , First Publish Date - 2022-04-04T09:37:55+05:30 IST

చైనా మరోసారి కరోనా కోరల్లో చిక్కుకొని విలవిలలాడుతోంది. ఆదివారం ఒక్కరోజే రికార్డు స్థాయిలో 13,146 కొత్త కేసులు నమోదయ్యాయి.

కరోనా కోరల్లో చైనా.. ఒక్కరోజే 13వేల కేసులు

బీజింగ్‌, ఏప్రిల్‌ 3: చైనా మరోసారి కరోనా కోరల్లో చిక్కుకొని విలవిలలాడుతోంది. ఆదివారం ఒక్కరోజే రికార్డు స్థాయిలో 13,146 కొత్త కేసులు నమోదయ్యాయి. వీటిలో దాదాపు 70ు  షాంఘైలోనే బయటపడ్డాయి. దీంతో అక్కడ కఠిన లాక్‌డౌన్‌ అమలు చేస్తున్నారు. ఆ నగరం పరిధిలో ప్రతి పౌరుడికి చెరో రెండు(యాంటీజెన్‌, న్యూక్లిక్‌ యాసిడ్‌) కొవిడ్‌ పరీక్షలు నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. కరోనా తొలి వేవ్‌తో పోలిస్తే ఇప్పుడు చైనా లో ఎక్కువ కేసులు నమోదవుతున్నాయని గణాంకాలను బట్టి తెలుస్తోంది. 

Updated Date - 2022-04-04T09:37:55+05:30 IST