చైనా రుణ యాప్‌లకు సాయపడిన క్రిప్టో ఎక్స్ఛేంజ్‌లపై ఈడీ దర్యాప్తు!

ABN , First Publish Date - 2022-08-13T05:42:02+05:30 IST

చైనా రుణ యాప్‌ల మనీలాండరింగ్‌ కార్యకలాపాలు, అందుకు సాయపడిన క్రిప్టో కరెన్సీ ఎక్స్ఛేంజ్‌ల లావాదేవీలపై కేంద్ర దర్యాప్తు ఏజెన్సీ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ)

చైనా రుణ యాప్‌లకు సాయపడిన క్రిప్టో ఎక్స్ఛేంజ్‌లపై ఈడీ దర్యాప్తు!

10 క్రిప్టో ఎక్స్ఛేంజ్‌ల ద్వారా రూ.1,000 కోట్ల మనీలాండరింగ్‌!!

 జాబితాలో వజీర్‌ఎక్స్‌, వాల్డ్‌ 


న్యూఢిల్లీ:  చైనా రుణ యాప్‌ల మనీలాండరింగ్‌ కార్యకలాపాలు, అందుకు సాయపడిన  క్రిప్టో కరెన్సీ ఎక్స్ఛేంజ్‌ల లావాదేవీలపై కేంద్ర దర్యాప్తు ఏజెన్సీ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ) దృష్టిసారించింది. రూ.1,000 కోట్లకు పైగా మనీలాండరింగ్‌ ఆరోపణలకు సంబంధించి కనీసం 10 క్రిప్టో ఎక్స్ఛేంజ్‌లపై ఈడీ దర్యాప్తు చేస్తున్న ట్లు సమాచారం. వజీర్‌ఎక్స్‌ పేరుతో క్రిప్టో ఎక్స్ఛేంజ్‌ను నిర్వహిస్తున్న జన్మయ్‌ ల్యాబ్‌ డైరెక్టర్‌ సమీర్‌ మాత్రేకు చెందిన ప్రాంతాల్లో గతవారం సోదాలు నిర్వహించిన ఏజెన్సీ.. ఎక్స్ఛేంజ్‌కు చెందిన రూ.64.67 కోట్ల బ్యాంక్‌ డిపాజిట్లను స్తంభింపజేసింది. గురువారం మరో క్రిప్టో ఎక్స్ఛేంజ్‌కు చెందిన ప్రాంతాల్లో సోదాలు నిర్వహించిన ఈడీ.. రూ.370 కోట్ల ఆస్తులను జప్తు చేసినట్లు తెలిసిం ది. ఈడీ అధికారికంగా వెల్లడించకపోయినప్పటికీ.. జప్తు చేసిన ఆస్తులు వాల్డ్‌ అనే క్రిప్టో ఎక్స్ఛేంజ్‌కు చెందినవని విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. 

భారత్‌లో కార్యకలాపాలు సాగిస్తున్న పలు చైనా రుణ యాప్‌లు.. క్రిప్టో ఎక్స్ఛేంజ్‌ల ద్వారా భారీగా మనీలాండరింగ్‌కు పాల్పడినట్లు ఈడీ దృష్టికి వచ్చింది. వజీర్‌ఎక్స్‌ ద్వారా రూ.67 కోట్ల వరకు లాండరింగ్‌ జరిగి ఉంటుందని అధికారులు భావిస్తున్నారు.


ఈ రుణ యాప్‌లు క్రిప్టో ఎక్స్ఛేంజ్‌ల నుంచి వంద ల కోట్ల రూపాయల క్రిప్టో కరెన్సీలను కొనుగోలు చేసి, వాటిని విదేశాల్లోని తమ మాతృసంస్థల వ్యాలెట్లకు బదిలీ చేసినట్లు దర్యాప్తు ఏజెన్సీ గుర్తించింది. అంతేకాదు, ఈ రుణ యాప్‌లకు చైనా, హాంకాంగ్‌ నుంచి క్రిప్టోల రూపంలో భారీగా నిధులు అందుకున్నట్లు సమాచారం. రూ.2,790 కోట్ల విలువైన క్రిప్టో ఆస్తులను వివరాలు తెలియని విదేశీ వ్యాలెట్లకు బదిలీ చేసిన వజీర్‌ఎక్స్‌కు విదేశీ మారక నిర్వహణ చట్టం (ఫెమా) ప్రకారంగా షోకాజ్‌ నోటీస్‌ జారీ చేయడం జరిగిందని ఆర్థిక శాఖ సహాయ మంత్రి పంకజ్‌ చౌదరీ స్వయంగా పార్లమెంట్‌కు వెల ్లడించారు. మనీలాండరింగ్‌ వ్యవహారానికి సంబంధించి 74 ఫిన్‌టెక్‌ కంపెనీలతోపాటు ఆర్‌బీఐ నిబంధనలను అతిక్రమించిన 12 నాన్‌ బ్యాంకింగ్‌ ఫైనాన్స్‌ కంపెనీలపై (ఎన్‌బీఎ్‌ఫసీ)ఏజెన్సీ దర్యాప్తు చేస్తున్నట్లు తెలిసింది. 

Updated Date - 2022-08-13T05:42:02+05:30 IST