సంక్షోభంలో చైనా రియల్ రంగం!

ABN , First Publish Date - 2021-10-20T22:23:00+05:30 IST

చైనాలో తలెత్తిన ఈ సంక్షోభంతో ప్రపంచం ఆందోళనకు గురవుతోంది. అమెరికా తర్వాత అతి పెద్ద జీడీపీ కలిగిన దేశంగా ఉన్న చైనా.. అనేక దేశాల్లో పెట్టుబడులు పెట్టింది, పలు ఆర్థిక కార్యకలాపాలు నిర్వహిస్తోంది. చైనా రియల్ రంగంలో తలెత్తిన ఈ సంక్షోభం వాటిపై ప్రభావం చూపిస్తుందని ఆందోళనకు గురవతున్నారు..

సంక్షోభంలో చైనా రియల్ రంగం!

బీజింగ్: చైనాలో రియల్ ఎస్టేల్ సంక్షోభం వైపుగా అడుగులు వేస్తోన్న లక్షణాలు కనిపిస్తున్నాయి. బాండ్లు, రుణాలు చెల్లించలేక దేశంలోని ప్రముఖ రియల్ ఎస్టేట్ కంపెనీలు ఒక్కొక్కటిగా చేతులు ఎత్తేయడమే దీనికి కారణం. ఇప్పట్లో ఈ సంక్షోభం గట్టెక్కే సూచనలు కనిపించడం లేదని నిపుణులు అంటున్నారు. మోడెర్న్ ల్యాండ్, చీర్‌గెయిన్, ఎవర్‌గ్రాండె, ఫాంటాసియా ఇలా ఒక్కొక్కటిగా నష్టాల్లో కూరుకుపోతున్నాయి. కేవలం నెల రోజుల వ్యవధిలోనే చైనాకు చెందిన పలు రియల్ ఎస్టేట్ కంపెనీలు ఆర్థిక నష్టాల్లో కూరుకు పోయాయంటే పరిస్థితి ఎలా అర్థం చేసుకోవచ్చు.


చైనాలో తలెత్తిన ఈ సంక్షోభంతో ప్రపంచం ఆందోళనకు గురవుతోంది. అమెరికా తర్వాత అతి పెద్ద జీడీపీ కలిగిన దేశంగా ఉన్న చైనా.. అనేక దేశాల్లో పెట్టుబడులు పెట్టింది, పలు ఆర్థిక కార్యకలాపాలు నిర్వహిస్తోంది. చైనా రియల్ రంగంలో తలెత్తిన ఈ సంక్షోభం వాటిపై ప్రభావం చూపిస్తుందని ఆందోళనకు గురవతున్నారు. దేశంలో రెండో అతిపెద్ద సంస్థ ఎవర్‌గ్రాండె బాండ్లు, రుణాలను చెల్లించలేనని చేతులెత్తేసింది. సీనిక్ హోల్డింగ్స్ సంస్థ ఆఫ్‌షోర్, మరో కంపెనీ ఫాంటాసియా బాండ్లు చెల్లింపు చేయలేదు. సమయం గడిచిపోతున్నా వీటిపై ఆయా సంస్థలు ఎలాంటి ప్రకటనలు చేయడం లేదు. అనేక కంపెనీలు నిధులకు కటకటలాడుతున్నాయి.

Updated Date - 2021-10-20T22:23:00+05:30 IST