చైనా బాణసంచాతో ఆస్తమా, కంటి జబ్బులు..నిజమెంత?

ABN , First Publish Date - 2021-10-19T17:06:22+05:30 IST

దీపావళి సంబరాలు దగ్గర పడుతుండటంతో చైనా నుంచి బాణసంచా, ప్రతేయక అలంకరణ దీపాలు భారత్‌కు..

చైనా బాణసంచాతో ఆస్తమా, కంటి జబ్బులు..నిజమెంత?

న్యూఢిల్లీ: దీపావళి సంబరాలు దగ్గర పడుతుండటంతో చైనా నుంచి బాణసంచా, ప్రత్యేక అలంకరణ దీపాలు భారత్‌కు దిగుమతయ్యాయి. అయితే, వీటిని వాడితే ఆస్తమా, కంటి జబ్బులు వస్తాయంటూ ఓ వార్త సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. కేంద్రం హోం శాఖ సీనియర్ ఇన్వెస్టిగేటింగ్ ఆఫీసర్ విశ్వజిత్ ముఖర్జీ ఈ విషయం చెప్పినట్టు ఆ వార్త పేర్కొంటోంది. ''ఇంటెలిజెన్స్ సమాచారం ప్రకారం, భారత్‌ను నేరుగా ఢీకొనలేని పాకిస్తాన్ ఇండియాపై పగ తీర్చుకోవాలంటూ చైనా ముందు ఓ డిమాండ్ పెట్టింది. దీంతో చైనా ప్రత్యేక తరహా బాణసంచాలు తయారు చేసింది. ఇందులో టాక్సిక్, కార్బన్ మోనాక్సైడ్ గ్యాస్ ఉపయోగించారు. ఇవి భారత్‌లో ఆస్తమా విస్తరించడానికి దోహదం చేస్తాయి. దీనికి తోడు ప్రత్యేక అలంకరణ దీపాలు వాడితే కంటి వ్యాధులు పెరుగుతాయి. ఈ దీపావళికి జాగ్రత్తగా ఉండండి'' అంటూ సోషల్ మీడియా పోస్ట్‌ పేర్కొంటోంది..


కాగా, ఇందులో నిజమెంతనేది 'ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో ఆఫ్ ఇండియా' నిగ్గుతేల్చింది. ఇందులో ఎంతమాత్రం నిజం లేదని, ఇలాంటి సమాచారం ఏదీ హోం మంత్రిత్వ శాఖ జారీ చేయలేదని స్పష్టం చేసింది

Updated Date - 2021-10-19T17:06:22+05:30 IST