చిన్నతనంలోనే తల్లిదండ్రులకు దూరమైన కుర్రాడు.. 17 ఏళ్ల తరువాత వారి కోసం ఇంటికి చేరగా.. వారు చేసిన పనికి షాకై అనూహ్యంగా ఏం చేశాడంటే..

ABN , First Publish Date - 2022-01-28T05:47:58+05:30 IST

ఆ కుర్రాడి జీవితమంతా బాధలే. పుట్టిన కొన్ని రోజులకే కన్న తల్లిదండ్రులకు దూరమయ్యాడు. నాలుగేళ్ల వయసులో దత్తత తీసుకున్న తల్లిదండ్రులు ఒక ప్రమాదంలో చనిపోయారు. కొన్ని సంవత్సారాలు అనాథాశ్రమంలో పెరిగాడు. ఆ తరువాత అనుకోకుండా అతని కన్నవారి ఆచూకీ తెలుసుకొని ఎంతో సంతోషంగా వారి ఇంటికి వెళ్లాడు. కానీ అక్కడ అతని పుట్టుక రహస్యం తెలుసుకొని షాక్‌కు గురయ్యాడు...

చిన్నతనంలోనే తల్లిదండ్రులకు దూరమైన కుర్రాడు.. 17 ఏళ్ల తరువాత వారి కోసం ఇంటికి చేరగా.. వారు చేసిన పనికి షాకై అనూహ్యంగా ఏం చేశాడంటే..

ఆ కుర్రాడి జీవితమంతా బాధలే. పుట్టిన కొన్ని రోజులకే కన్న తల్లిదండ్రులకు దూరమయ్యాడు. నాలుగేళ్ల వయసులో దత్తత తీసుకున్న తల్లిదండ్రులు ఒక ప్రమాదంలో చనిపోయారు. కొన్ని సంవత్సారాలు అనాథాశ్రమంలో పెరిగాడు. ఆ తరువాత అనుకోకుండా అతని కన్నవారి ఆచూకీ తెలుసుకొని ఎంతో సంతోషంగా వారి ఇంటికి వెళ్లాడు. కానీ అక్కడ అతని పుట్టుక రహస్యం తెలుసుకొని షాక్‌కు గురయ్యాడు. వివరాల్లోకి వెళితే..


చైనాలో నివసించే 17 ఏళ్ల లియు జౌ అనే కుర్రాడిని పుట్టిన వెంటనే అతని తల్లిదండ్రులు మరొకరికి అమ్మేశారు. ఆ తరువాత అతనికి 4 ఏళ్ల వయసు ఉన్నప్పుడు దత్తత తీసుకున్న తల్లిదండ్రులు ఒక అగ్నిప్రమాదంలో చనిపోయారు. దీంతో చిన్నారి లియు జౌ కొన్ని రోజులు అమ్మమ్మ, తాతాయ్య వద్ద, మరి కొన్ని రోజులు అనాధాశ్రమంలో పెరిగాడు. అనాధాశ్రమంలో కొన్ని సంవత్సరాలు గడిపాక లియు మళ్లీ అమ్మమ్మ, తాతయ్యల వద్దకు వచ్చాడు. అక్కడ వారు అతనికి ఒక నిజం చెప్పారు. అతడిని వాళ్ల కుటుంబం దత్తత తీసుకుందని.. లియు కన్న తల్లిదండ్రులు అతడిని డబ్బుల కోసం అమ్మేశారని చెప్పారు. 


ఇది విన్న లియు మొదట చాలా బాధపడ్డాడు. ఆ తరువాత తన కన్న తల్లిదండ్రులు ఎక్కడున్నా వెళ్లి కలవాలని నిర్ణయించుకున్నాడు. వారికోసం సోషల్ మీడియా ద్వారా వెతికాడు. చివరికి వారి ఆచూకీ తెలుసుకున్నాడు. ఎంతో కష్టపడి తన కన్నతల్లి వద్దకు చేరుకోగా.. ఆమె అతడిని స్వీకరించలేదు. ఆమె ఎందుకలా చేసిందో.. చెప్పాలని లియు నిలదీశాడు. దానికి లియు తల్లి అతని పుట్టుక గురించి రహస్యం చెప్పింది. లియు తల్లి పెళ్లికాక ముందే అతనికి జన్మనిచ్చింది. లియు తండ్రి ఆమెను పెళ్లిచేసుకోకుండా ఎటో వెళ్లిపోయాడు. దీంతో ఆమె మరో పెళ్లి చేసుకోవాలంటే పుట్టిన బిడ్డని దూరం చేసుకోవాలి. అందుకని ఒక ఏజెంట్ ద్వారా తన పసిబిడ్డ లియుని 27,000 చైనా యువాన్ల(దాదాపు రూ.3 లక్షలు)కు అమ్మేసింది. 


ఇప్పుడు లియు తల్లి మరొకరిని పెళ్లాడి తనకంటూ ఒక కుటుంబం ఏర్పర్చుకుంది. అందుకని అతడిని తిరస్కరించింది. ఈ నిజం తెలుసుకున్న లియు తీవ్ర మనస్తాపానికి గురయ్యాడు. చిన్నతనం నుంచి తనని ఎవరూ మనస్ఫూర్తిగా ప్రేమించలేదని.. ఇప్పుడు కన్నవారెవరో తెలిసినా తనని కుటుంబంగా భావించలేదని బాధపడుతూ.. డిప్రెషన్‌లోకి వెళ్లిపోయాడు. డిప్రెషన్‌తో బాధపడుతూ ఒకరోజు యాంటీ డిప్రెషన్ మందులను భారీ మోతాదులో తీసుకొని తన జీవితం గురించి సోషల్ మీడియాలో ఒక పోస్టు పెట్టాడు. ఆ తరువాత నిద్రపోయిన లియు ఉదయం కల్లా ప్రాణం వదిలేశాడు. అలా లియు జీవితం విషాదాంతంగా మారింది.


Updated Date - 2022-01-28T05:47:58+05:30 IST