లైంగిక దాడా..అబ్బే లేదు!

ABN , First Publish Date - 2022-02-08T08:49:12+05:30 IST

తనపై లైంగిక దాడి జరగలేదని చైనా టెన్నిస్‌ స్టార్‌ పెంగ్‌ షూయ్‌ మరోసారి స్పష్టంచేసింది.

లైంగిక దాడా..అబ్బే లేదు!

బీజింగ్‌: తనపై లైంగిక దాడి జరగలేదని చైనా టెన్నిస్‌ స్టార్‌ పెంగ్‌ షూయ్‌ మరోసారి స్పష్టంచేసింది. ‘లైంగిక వేధింపులా? నన్ను లైంగిక వేధింపులకు గురి చేశారని ఎప్పుడూ చెప్పలేదే’ అని ఫ్రెంచ్‌ పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో మూడుసార్లు ఒలింపిక్‌ డబుల్స్‌ చాంపియన్‌ పెంగ్‌ చెప్పింది. చైనా మాజీ ఉపప్రధాని ఝాంగ్‌ గవోలి తనపై లైంగిక దాడి చేశాడని గత నవంబరులో చైనా సోషల్‌మీడియా ‘వీబో’లో షూయ్‌ సంచలన ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. అయితే కొద్దిసేపటికే ఆమె ఆ పోస్ట్‌ను తొలగించింది. ‘ఈ పోస్ట్‌ బయటి ప్రపంచంలో ఎంతో అపార్థానికి దారితీసింది’ అని 36 ఏళ్ల పెంగ్‌ చెప్పుకొచ్చింది. 

Updated Date - 2022-02-08T08:49:12+05:30 IST