అమరావతి: పోలీస్ వ్యవస్థను ఉపయోగించుకొని కక్ష సాధింపు, కౌంటర్ కేసులు పెడుతున్నారని మాజీ హోం మంత్రి చినరాజప్ప ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రైతుల మీద దాడులు, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ వర్గాలపై దాడులు జరుగుతున్నాయన్నారు. సలాం కుటుంబం ఆత్మహత్యపై ప్రభుత్వ స్పందనకు నిరసనగా ముస్లిం నాయకులు ఛలో అసెంబ్లీకి పిలుపునిస్తే వారిని హౌస్ అరెస్ట్ చేస్తున్నారన్నారు. రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ పని చేయడం లేదన్నారు.