ప్రశ్నించే హక్కు ప్రతిపక్షాలకు లేదా?: చినరాజప్ప

ABN , First Publish Date - 2021-09-09T15:49:24+05:30 IST

లోకేష్ పర్యటన అడ్డుకోవడానికి, టీడీపీ నాయకుల పట్ల పోలీసులు ప్రవర్తిస్తున్న తీరుపై చినరాజప్ప మండిపడ్డారు.

ప్రశ్నించే హక్కు ప్రతిపక్షాలకు లేదా?: చినరాజప్ప

విజయవాడ: తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ పర్యటన అడ్డుకోవడం, టీడీపీ నాయకుల పట్ల పోలీసులు ప్రవర్తిస్తున్న తీరుపై ఆ పార్టీ పొలిట్ బ్యూరో సభ్యుడు, మాజీ మంత్రి నిమ్మకాయల చినరాజప్ప తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా గురువారం ఆయన మాట్లాడుతూ అన్యాయాన్ని ప్రశ్నించే హక్కు ప్రతిపక్షాలకు లేదా? అని ప్రశ్నించారు. గొళ్లపాడులో ఉన్మాది చేతిలో బలైన అనూష కుటుంబాన్ని పరామర్శించడానికి వెళుతున్న నారా లోకేష్‌కు పోలీసులు అనుమతి నిరాకరించడం అన్యాయమన్నారు. వైఎస్‌ వర్థంతికి లేని కరోనా నిబంధనలు... బాధిత కుటుంబాన్ని పరామర్శించడానికి వచ్చాయా? అని నిలదీశారు. అన్యాయానికి గురైన కుటుంబాన్ని పరామర్శించడానికి వచ్చే నారా లోకేష్‌ను అడ్డుకోవాలని చూడడం సరికాదని చినరాజప్ప అన్నారు. 

Updated Date - 2021-09-09T15:49:24+05:30 IST