‘మరో నాలుగైదేళ్లలో చైనా బిట్‌కాయిన్‌ను నిషేధించొచ్చు..’

ABN , First Publish Date - 2021-07-27T01:45:13+05:30 IST

బిట్‌కాయిన్‌పై చైనా కొరడా ఝళిపిస్తోంది. ఇప్పటికే బిట్‌కాయిన్ మైనింగ్‌పై నిషేధాన్ని విధించింది. అయితే..చైనా ధోరణి చూస్తుంటే భవిష్యత్తులో బిట్‌కాయిన్‌పై నిషేధం తప్పదని అక్కడి తొలి బిట్ కాయిన్ ఎక్స్‌ఛేంజ్ వ్యవస్థాపకుడు బాబీ లీ తాజాగా వ్యాఖ్యానించారు.

‘మరో నాలుగైదేళ్లలో చైనా బిట్‌కాయిన్‌ను నిషేధించొచ్చు..’

బీజింగ్: బిట్‌కాయిన్‌పై చైనా కొరడా ఝళిపిస్తోంది. ఇప్పటికే బిట్‌కాయిన్ మైనింగ్‌పై నిషేధాన్ని విధించింది. అయితే..చైనా ధోరణి చూస్తుంటే భవిష్యత్తులో బిట్‌కాయిన్‌పై నిషేధం తప్పదని అక్కడి తొలి బిట్ కాయిన్ ఎక్స్‌ఛేంజ్ వ్యవస్థాపకుడు బాబీ లీ తాజాగా వ్యాఖ్యానించారు. ‘‘ చైనా కరెన్సీ రెన్మింబీ వినియోగాన్ని ప్రపంచవ్యాప్తం చేసేందుకే కమ్యూనిస్టు ప్రభుత్వం క్రిప్టో కరెన్సీలను నియత్రించేందుకు ప్రయత్నిస్తోంది.  అయితే..చైనా తీరు చూస్తుంటే మరో 4 లేదా 5 ఏళ్లలో బిట్‌కాయిన్‌ను పూర్తి స్థాయిలో నిషేధించొచ్చని అనుకుంటున్నా..’’ అని ఆయన వ్యాఖ్యానించారు. కాగా.. బిట్‌కాయిన్‌లో ప్రజలు హైరిస్క్ పెట్టుబడులు పెట్టే ఆస్కారం ఉండటంతో చైనా ప్రభుత్వం ముందు జాగ్రత్త చర్యలు తీసుకుంటోందని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు.

Updated Date - 2021-07-27T01:45:13+05:30 IST