Shanghaiలో దశలవారీగా లాక్‌డౌన్ ఎత్తివేత

ABN , First Publish Date - 2022-04-22T12:54:33+05:30 IST

చైనా దేశంలోని షాంఘై నగరంలో కొవిడ్ మహమ్మారి తగ్గుముఖం పడుతోంది.

Shanghaiలో దశలవారీగా లాక్‌డౌన్ ఎత్తివేత

షాంఘై (చైనా): చైనా దేశంలోని షాంఘై నగరంలో కొవిడ్ మహమ్మారి తగ్గుముఖం పడుతోంది. చైనాలోని అతిపెద్ద నగరాల్లో ఒకటైన షాంఘైలో తాజాగా జరిపిన కరోనా పరీక్షల్లో కేసుల సంఖ్య తగ్గుతుండటంతో దశలవారీగా కొవిడ్ లాక్ డౌన్‌ను ఎత్తివేయాలని ఆ దేశ సర్కారు నిర్ణయించింది.కరోనా తగ్గుముఖం పడుతుండటంతో షాంఘై నగరంలో త్వరలో జీవనం సాధారణ స్థితికి చేరుకుంటుందని షాంఘై ఆరోగ్య శాఖ అధికారులు చెప్పారు.శుక్రవారం నుంచి షాంఘై నివాసితులందరికీ కొవిడ్ పరీక్షలు చేయాలని చైనా సర్కారు నిర్ణయించింది. కరోనా కేసుల వ్యాప్తితో గత కొన్ని రోజులుగా షాంఘై నగరం లాక్ డౌన్ చేశారు.దశల వారీగా లాక్ డౌన్‌ను ఎత్తివేయాలనే నిర్ణయంతో షాంఘై ప్రజలు ఊపిరిపీల్చుకున్నారు.


Updated Date - 2022-04-22T12:54:33+05:30 IST