పాఠశాల విద్య డైరెక్టర్‌గా చినవీరభద్రుడు

ABN , First Publish Date - 2020-08-09T09:45:04+05:30 IST

ఇద్దరు ఐఏఎస్‌ అధికారుల బాధ్యతల్లో ప్రభుత్వం మార్పులు చేసింది. సమగ్ర శిక్ష(ఎ‌స్‌ఎ‌స్‌ఏ) స్టేట్‌ ప్రాజెక్ట్‌ డైరెక్టర్‌ పదవి నుంచి వాడ్రేవు చినవీరభద్రుడిని తప్పించింది.

పాఠశాల విద్య డైరెక్టర్‌గా చినవీరభద్రుడు

అమరావతి, ఆగస్టు 8 (ఆంధ్రజ్యోతి): ఇద్దరు ఐఏఎస్‌ అధికారుల బాధ్యతల్లో ప్రభుత్వం మార్పులు చేసింది. సమగ్ర శిక్ష(ఎ‌స్‌ఎ‌స్‌ఏ) స్టేట్‌ ప్రాజెక్ట్‌ డైరెక్టర్‌ పదవి నుంచి వాడ్రేవు చినవీరభద్రుడిని తప్పించింది. ప్రస్తుతం ఆయన పాఠశాల విద్య ఇన్‌చార్జి డైరెక్టర్‌గా, సమగ్ర శిక్ష ఎస్‌పీడీగా రెండు పోస్టులు నిర్వహిస్తున్నారు. ఇకపై ఆయన పాఠశాల విద్య డైరెక్టర్‌(రెగ్యులర్‌)గా మాత్రమే కొనసాగనున్నారు. ప్రస్తుతం ఇంగ్లీషు మీడియం అమలు ప్రాజెక్టుకు స్పెషల్‌ ఆఫీసర్‌గా పనిచేస్తున్న కె.వెట్రిసెల్వికి ఎస్‌ఎ్‌సఏ ఎస్‌పీడీ బాధ్యతలు అప్పగించారు. ఇంగ్లీషు మీడియం అమలు ప్రాజెక్టు ప్రత్యేక అధికారిణిగా కూడా ఆమె అదనపు బాధ్యతలు నిర్వర్తించనున్నారు.  

Updated Date - 2020-08-09T09:45:04+05:30 IST