చైనీస్‌ పకోడా

ABN , First Publish Date - 2022-01-28T17:24:22+05:30 IST

క్యాబేజీ ముక్కలు- కప్పు: ఉల్లిగడ్డ, క్యారెట్‌ ముక్కలు- అర కప్పు, సాస్‌- అర స్పూను, అల్లం ముక్కలు - స్పూను, కారం - అర స్పూను,

చైనీస్‌ పకోడా

కావలసిన పదార్థాలు: క్యాబేజీ ముక్కలు- కప్పు: ఉల్లిగడ్డ, క్యారెట్‌ ముక్కలు- అర కప్పు, సాస్‌- అర స్పూను, అల్లం ముక్కలు - స్పూను, కారం - అర స్పూను, మిరియాల పొడి- అర స్పూను, ఉప్పు, నీళ్లు, నూనె - తగినంత, శనగ పిండి- అర కప్పు, మైదా- పావు కప్పు, మొక్కజొన్న పొడి- రెండు స్పూన్లు.


తయారుచేసే విధానం: కూరగాయల ముక్కలన్నిటినీ ఓ గిన్నెలోకి తీసుకోవాలి. దీంట్లో సాస్‌, అల్లం ముక్కలు, కారం, ఉప్పు కలపాలి. ఆ తరవాత శనగ పిండి, మైదాలను చేర్చి మూత పెట్టి పక్కనపెట్టాలి. ఓ అర గంట తరవాత కడాయిలో నూనె మరిగించి చిన్న చిన్న ముద్దలుగా పిండిని వేస్తే పకోడా సిద్ధం.

Updated Date - 2022-01-28T17:24:22+05:30 IST