చైనీస్‌ పాన్‌కేక్స్‌

ABN , First Publish Date - 2021-08-19T18:01:37+05:30 IST

గోధుమ పిండి- రెండు కప్పులు, ఉల్లికాడ ముక్కలు- రెండున్నర కప్పులు, ఉప్పు, నీళ్లు, నూనె- తగినంత, మిరియాల పొడి- స్పూను, గరం మసాలా- స్పూను.

చైనీస్‌ పాన్‌కేక్స్‌

కావలసిన పదార్థాలు: గోధుమ పిండి- రెండు కప్పులు, ఉల్లికాడ ముక్కలు- రెండున్నర కప్పులు, ఉప్పు, నీళ్లు, నూనె- తగినంత, మిరియాల పొడి- స్పూను, గరం మసాలా- స్పూను.


తయారుచేసే విధానం: గోధుమ పిండిలో కాస్త ఉప్పు కలిపి వేడి నీళ్లతో ముద్దలా చేసి ఓ అయిదు నిమిషాలు పక్కన పెట్టాలి. ఓ గిన్నెలో ఉల్లికాడ ముక్కలు, ఉప్పు, మిరియాల పొడి, గరం మసాలా వేసి బాగా కలపాలి. ఆ తరవాత దీన్ని ఎనిమిది భాగాలుగా చేసుకోవాలి. ప్రతి ముద్దను గుండ్రటి చపాతీలా వత్తుకోవాలి. పైన నూనె వేసి ఉల్లిముక్కల మిశ్రమాన్ని అంతటా చల్లి చుట్టలా చుట్టాలి. అటూ ఇటూ కాస్త పిండి వేసి కర్రతో చపాతీలా వత్తుకుని పెనం మీద వేయిస్తే చైనీస్‌ పాన్‌కేక్స్‌ రెడీ. 

Updated Date - 2021-08-19T18:01:37+05:30 IST