ఆ దేశ పాఠ్య పుస్తకాల్లో అశ్లీల చిత్రాలు.. ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రజల నిరసన

ABN , First Publish Date - 2022-06-02T07:39:05+05:30 IST

ఇటీవల భారత పొరుగు దేశం చైనాలో స్కూలు పిల్లల తల్లిదండ్రులు ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసనకు దిగారు. ప్రభుత్వం ప్రచురించిన పిల్లల పాఠ్య పుస్తుకాల్లో అశ్లీల చిత్రాలు ఉండడమే దీనికి ప్రధాన కారణం...

ఆ దేశ పాఠ్య పుస్తకాల్లో అశ్లీల చిత్రాలు.. ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రజల నిరసన

ఇటీవల భారత పొరుగు దేశం చైనాలో స్కూలు పిల్లల తల్లిదండ్రులు ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసనకు దిగారు. ప్రభుత్వం ప్రచురించిన పిల్లల పాఠ్య పుస్తుకాల్లో అశ్లీల చిత్రాలు ఉండడమే దీనికి ప్రధాన కారణం. నిరసనలు తీవ్రమవడంతో చైనా విద్యా మంత్రిత్వ శాఖ రంగంలో దిగింది. ఆ పుస్తకాలు ప్రచురించిన సంస్థను పబ్లిషర్‌ను.. వెంటనే ఆ చిత్రాలు మార్చాలని ఆదేశాలు జారీ చేసింది. 


వివరాల్లోకి వెళితే.. చైనా ప్రభుత్వం తరుపున స్కూలు పాఠ్య పుస్తకాలు ప్రచురణ చేసే 'పీపుల్స్ ఎడుకేషన్ ప్రెస్' అనే సంస్థ గణిత పాఠ్యాంశాలల్లో కొన్ని  అసభ్యకర  దృష్టాంతాలను(Illustrations) ప్రచురించింది. ఈ చిత్రాలను గమనించిన పిల్లల తల్లిదండ్రులు విద్యాశాఖకు వ్యతిరేకంగా నిరసనకు దిగారు. ఈ చిత్రాలలో కొన్ని జాతి వ్యతిరేకంగా, అందవికారంగా, జాత్యహంకారాన్ని  సూచించే విధంగా ఉన్నాయని పిల్లల తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. 




ఆ చిత్రాలలో(దృష్టాంతాలు) ఉన్న చిన్న పిల్లల బొమ్మల కళ్లు చిన్నవిగా ఉన్నాయి. ఒకదానిలో ఒక బాలుడు అమెరికా జాతీయ జెండాను పోలీన దుస్తులు ధరించి ఉన్నాడు. ఈ రెండు అంశాలు చైనీయులను కించపరిచే విధంగా ఉన్నయని చైనా ప్రజలు భావిస్తున్నారు. మరో రెండు చిత్రాలలో చిన్నపిల్లల లోదుస్తులు కనిపించే విధంగా ఉన్నాయి. ఇలాంటి అసభ్యకర చిత్రాలు ప్రచురణ చేయల్సిన అవసరం ఏముందని విద్యార్థుల తల్లిదండ్రులు సోషల్ మీడియా వేదికగా ప్రశ్నిస్తున్నారు. 


పాఠ్య పుస్తకాల్లో ఉన్న చిత్రాలపై ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత రావడంతో చైనా విద్యాశాఖ.. వెంటనే వాటిని మార్చాలని  ప్రచురణ సంస్థ పీపుల్స్ ఎడుకేషన్ ప్రెస్‌కు ఆదేశాలు జారీచేసింది. 



Updated Date - 2022-06-02T07:39:05+05:30 IST