చైనా సైబర్ దాడి కారణంగానే మహారాష్ట్ర అంధకారం!

ABN , First Publish Date - 2021-03-02T04:26:42+05:30 IST

గతేడాది దేశ వాణిజ్య రాజధాని ముంబై మహానగరం అంధకార మయం అయిన ఘటన గుర్తుంది కదా. అక్టోబరు 12న ముంబై మహానగరంలో ఉన్నట్లుండి పవర్ ఔటేజ్ జరిగింది. గ్రిడ్లు ఫెయిలవడంతో కరెంటు పూర్తిగా పోయింది.

చైనా సైబర్ దాడి కారణంగానే మహారాష్ట్ర అంధకారం!

ముంబై: గతేడాది దేశ వాణిజ్య రాజధాని ముంబై మహానగరం అంధకార మయం అయిన ఘటన గుర్తుంది కదా. అక్టోబరు 12న ముంబై మహానగరంలో ఉన్నట్లుండి పవర్ ఔటేజ్ జరిగింది. గ్రిడ్లు ఫెయిలవడంతో కరెంటు పూర్తిగా పోయింది. అసలు ఇదంతా ఎందుకు జరిగిందో ఎవరికీ అర్థం కాలేదు. అయితే ఈ విషయంపై దర్యాప్తు చేయిస్తామని, కారణం కనుక్కుంటామని ప్రభుత్వం హామీ ఇచ్చింది. దీనిపై జరిగిన ప్రాథమిక విచారణలో షాకింగ్ విషయాలు వెలుగు చూశాయి. సోమవారం దీని గురించి వెల్లడించిన మహారాష్ట్ర హోం మంత్రి అనిల్ దేశ్‌ముఖ్.. ముంబై పవర్ ఔటేజికి సైబర్ సాబొటేజ్ ఎటాక్ కారణమని ప్రాథమిక విచారణలో తేలిందని చెప్పారు. ఈ ఎటాక్ చైనా ప్రభుత్వమే చేయించినట్లు తాము భావిస్తున్నామని వెల్లడించారు. ‘‘రాష్ట్ర సైబర్ సెల్ నుంచి ప్రాథమిక రిపోర్టు అందింది. ఈ నివేదిక ప్రకారం, సైబర్ దాడి కారణంగానే పవర్ ఔటేజ్ చోటుచేసుకున్నట్లు తెలుస్తోంది. విచారణలో బయటపడిన కొన్ని ఆధారాలు ఇదే విషయాన్ని సూచిస్తున్నాయి’’ అని దేశ్‌ముఖ్ తెలిపారు.

Updated Date - 2021-03-02T04:26:42+05:30 IST