పెళ్లి చేసుకుని, పిల్లలు కనాలనుకునేవారికి ప్రభుత్వం తీపికబురు.. రూ.23లక్షల వరకూ రుణాలు

ABN , First Publish Date - 2021-12-26T02:29:24+05:30 IST

పెళ్లి చేసుకుని, పిల్లలను కనాలనుకునే వారికి ప్రభుత్వం తీపి కబురు చెప్పింది. ఏకంగా రూ.23లక్షల వరకూ రుణాలు ఇచ్చేందుకు సిద్ధమైంది. అయితే ప్రజలకు ఈ ఆఫర్ ప్రకటించింది మన ప్రభుత్వం కాదు. మరె

పెళ్లి చేసుకుని, పిల్లలు కనాలనుకునేవారికి ప్రభుత్వం తీపికబురు.. రూ.23లక్షల వరకూ రుణాలు

ఇంటర్నెట్ డెస్క్: పెళ్లి చేసుకుని, పిల్లలను కనాలనుకునే వారికి ప్రభుత్వం తీపి కబురు చెప్పింది. ఏకంగా రూ.23లక్షల వరకూ రుణాలు ఇచ్చేందుకు సిద్ధమైంది. అయితే ప్రజలకు ఈ ఆఫర్ ప్రకటించింది మన ప్రభుత్వం కాదు. మరెక్కడా అని ఆలోచిస్తున్నారా? ఇందుకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళితే.. 


చైనా ఈశాన్య ప్రాంతంలోని జిలిన్ ప్రావిన్స్‌ ప్రభుత్వం.. పెళ్లి చేసుకుని, పిల్లలను కనేలా అక్కడి ప్రజలకు ప్రోత్సహిస్తోంది. ఇందులో భాగంగానే ప్రత్యేక రుణాలు ఇచ్చేలా అక్కడి ప్రభుత్వం బ్యాంకులకు మద్దతు ఇచ్చింది. పిల్లల సంఖ్యను బట్టి తక్కువ వడ్డీతో కూడిన రుణాలు పొందే అవకాశాన్ని కల్పించింది. జిలిన్ ప్రావిన్స్‌లో జనాభా రేటు తగ్గుతున్న క్రమంలో జనాభా రేటును పెంచడంపై అక్కడి ప్రభుత్వం దృష్టి సారించించింది. ఈ క్రమంలోనే ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది.  




Updated Date - 2021-12-26T02:29:24+05:30 IST