Viral: క్లాస్‌లో ఫస్ట్ వచ్చిన విద్యార్థులకు బహుమతిగా పందిపిల్లలు..!

ABN , First Publish Date - 2022-01-15T01:47:45+05:30 IST

చైనాలోని యిలియాంగ్ ప్రావిన్స్‌లోగల ఓ స్కూల్ మరింత వినూత్న కార్యక్రమాన్ని చేపట్టింది. క్లాస్‌లో ఫస్ట్ వచ్చిన విద్యార్థులకు బహుమతిగా పంది పిల్లలను పంచెపెట్టింది.

Viral: క్లాస్‌లో ఫస్ట్ వచ్చిన విద్యార్థులకు బహుమతిగా పందిపిల్లలు..!

ఇంటర్నెట్ డెస్క్:  అక్షరాస్యతను పెంచేందుకు ప్రభుత్వాలు అనేక చర్యలు చేపడుతుంటాయి. ముఖ్యంగా పేద విద్యార్థులను స్కూళ్లకు రప్పించేందుకు మధ్యాహ్న భోజన పథకం.. ఉచితంగా పుస్తకాల పంపిణీ వంటివి చేపడుతుంటాయి. ఇవన్నీ మనకు తెలిసిందే. అయితే.. చైనాలోని యిలియాంగ్ ప్రావిన్స్‌లోగల ఓ స్కూల్ మరింత వినూత్న కార్యక్రమాన్ని చేపట్టింది. క్లాస్‌లో ఫస్ట్ వచ్చిన విద్యార్థులకు బహుమతిగా పంది పిల్లలను పంచెపెట్టింది. ఒక్కో విద్యార్థికి ఒక్కోటి చప్పున పందిపిల్లలను ఇచ్చింది. వీటి ద్వారా ఆయా విద్యార్థుల కుటుంబాల పందుల పెంపకాన్ని చేపట్టి ఆర్థిక పరిపుష్టత సాధించాలనేది ఆ స్కూల్ యాజమాన్యం సంకల్పమట. అంతేకాకుండా.. స్థానికంగా ఆర్థికకార్యకలాపాలు పుంజుకునేందుకు కూడా ఇది దోహదం చేస్తుందట. కుటుంబాల ఆర్థిక కడగళ్లు తొలగిపోతే చిన్నారుల విద్యాభ్యాసానికి కూడా అడ్డంకులు తొలిగిపోతాయని స్కూలు వారు భావిస్తున్నన్నారు. ప్రస్తుతం ఈ వార్త చైనా అంతటా ఆసక్తి రేపుతోంది. 

Updated Date - 2022-01-15T01:47:45+05:30 IST