Viral Video: చైనాలో పరిస్థితి ఇలా ఉందా.. ఓ మహిళను నేలమీద పడేసి మీద కూర్చుని మరీ..

ABN , First Publish Date - 2022-05-06T17:56:36+05:30 IST

చైనాలో పుట్టి ప్రపంచం మొత్తాన్ని వణికించిన కరోనా వైరస్ ప్రస్తుతం ఆ దేశం మీదే తన ప్రతాపం చూపిస్తోంది.

Viral Video: చైనాలో పరిస్థితి ఇలా ఉందా.. ఓ మహిళను నేలమీద పడేసి మీద కూర్చుని మరీ..

చైనాలో పుట్టి ప్రపంచం మొత్తాన్ని వణికించిన కరోనా వైరస్ ప్రస్తుతం ఆ దేశం మీదే తన ప్రతాపం చూపిస్తోంది. కోవిడ్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో చైనా ప్రభుత్వం ఎక్కడికక్కడ లాక్ డౌన్ లు విధించింది. కఠిన నిబంధనలు రూపొందించి బలవంతంగా అమలు చేస్తోంది. ప్రస్తుతం చైనాలో దాదాపు 21 కోట్ల మంది సంపూర్ణ లేదా పాక్షిక లాక్ డౌన్‌లో ఉన్నట్టు వార్తలు వస్తున్నాయి. కరోనా వైరస్ కంటే ఎక్కువగా ప్రభుత్వ కఠిన ఆంక్షలే చైనా వాసులను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి.  


లక్షణాలు ఉన్నా, లేకపోయినా అధికారులు బ‌ల‌వంతంగా క‌రోనా పరీక్ష‌లు చేస్తున్నారు. చైనా వాసులకు బ‌ల‌వంత‌ంగా క‌రోనా ప‌రీక్ష‌లు చేస్తున్న వీడియోలు సోష‌ల్ మీడియాలు వైర‌ల్ అవుతున్నాయి. తాజాగా కోవిడ్ టెస్టింగ్ సెంటర్ వద్ద ఓ మహిళకు బలవంతంగా కరోనా పరీక్ష చేస్తున్న వీడియో తెగ వైరల్ అవుతోంది. కోవిడ్ టెస్ట్ చేయించుకునేందుకు ఇష్టపడని ఓ మహిళను బలవంతంగా నేలపై పడ్డుకోబెట్టి, ఓ మనిషి ఆమెపై కూర్చొని ఉండగా.. ల్యాబ్ టెక్నీషియన్ సాంపిల్ తీసుకున్నాడు. ఈ వీడియో చూసి.. చైనాలో పరిస్థితులు ఇంత దారుణంగా ఉన్నాయా అంటూ నెటిజన్లు షాక్ అవుతున్నారు.



Updated Date - 2022-05-06T17:56:36+05:30 IST

Read more