సాయుధ పోరాట యోధుడు చిన్నమల్లయ్య మృతి

ABN , First Publish Date - 2021-04-24T05:17:34+05:30 IST

హుస్నాబాద్‌ పట్టణానికి చెందిన సాయు ధ పోరాట యోధుడు కొండ చిన్నమల్లయ్య (95) శుక్రవారం అనారోగ్యంతో మృతి చెందారు.

సాయుధ పోరాట యోధుడు చిన్నమల్లయ్య మృతి
చిన్న మల్లయ్య (ఫైల్‌)

హుస్నాబాద్‌, ఏప్రిల్‌ 23: హుస్నాబాద్‌ పట్టణానికి చెందిన సాయు ధ పోరాట యోధుడు కొండ చిన్నమల్లయ్య (95) శుక్రవారం అనారోగ్యంతో మృతి చెందారు. చిన్నమల్లయ్య స్వాతం త్య్ర సమరయోధుల సంఘం ఉమ్మడి కరీంనగర్‌ జిల్లా ఉపాధ్యక్షుడిగా పని చేశారు. నిజాం నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా తెలంగాణ సాయుధ పోరాటం చేసిన వారిలో మల్లయ్య ఒకరు. ఆయన మృతి పట్ల కరీంనగర్‌ ఎంపీ బండి సంజయ్‌, రాజ్యసభ సభ్యుడు కెప్టెన్‌ లక్ష్మీకాంతారావు, మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్‌, ఎమ్మెల్యే వొడితెల సతీ్‌షకుమార్‌, మాజీ మంత్రి ఇనుగాల పెద్దిరెడ్డి, కాంగ్రెస్‌ పార్టీ నియోజకవర్గ ఇన్‌చార్జి బొమ్మ శ్రీరాంచక్రవర్తి, మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ ఆకుల రజిత వెంకన్న, డీసీసీ అధికార ప్రతినిధి కేడం లింగమూర్తి, సింగిల్‌విండో చైర్మెన్‌ బొలిశెట్టి శివయ్య సంతాపం తెలిపారు. 


 

Updated Date - 2021-04-24T05:17:34+05:30 IST