Chintamaneni Prabhakarకు ఊరట

ABN , First Publish Date - 2022-05-13T23:54:33+05:30 IST

దెందులూరు మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్‌ (Chintamaneni Prabhakar)పై నమోదైన కేసును విజయవాడలోని ప్రజాప్రతినిధుల కోర్టు కొట్టేసింది.

Chintamaneni Prabhakarకు ఊరట

విజయవాడ: దెందులూరు మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్‌ (Chintamaneni Prabhakar)పై నమోదైన కేసును విజయవాడలోని ప్రజాప్రతినిధుల కోర్టు కొట్టేసింది. ప్రభాకర్‌పై ఏలూరు టూ టౌన్‌ పోలీస్‌స్టేషన్‌లో క్రైం నంబర్‌ 90/2011తో ఐపీసీ 341, 352, 354, 324 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. దుగ్గిరాలకు చెందిన రాధిక అనే మహిళ 2011 మార్చిలో ఆయన ఇంటి ముందు అనుమానాస్పదంగా తిరిగింది. దీన్ని గమనించిన ఆయన అనుచరులు ఆపినా ఆగకుండా ఏలూరు రైల్వేస్టేషన్‌ వైపు వెళ్లింది. తన ఇంటి వద్ద ఎవరో మహిళ అనుమానాస్పదంగా తిరుగుతుందని పోలీసులకు సమాచారం ఇచ్చి, ఆమెను పట్టుకోవడానికి ప్రభాకర్‌ వెళ్లారు. ఏలూరు రైల్వేస్టేషన్‌ నుంచి రైలులో హైదరాబాద్‌ వెళ్లిన రాధిక అక్కడ చింతమనేనిపై ఫిర్యాదు చేసింది. అక్కడి నుంచి కేసును ఏలూరు టూ టౌన్‌కు బదిలీ చేశారు. ఈ కేసులో వాదోపవాదనలు విన్న ప్రజాప్రతినిధుల కోర్టు నేరం రుజువు కాకపోవడంతో చింతమనేని ప్రభాకర్‌ను నిర్దోషిగా తేల్చింది. కేసును కొట్టి వేస్తూ శుక్రవారం తీర్పును ఇచ్చింది. 

Read more