చిరంజీవి గారు ప్రశంసించారు

Sep 17 2021 @ 00:37AM

‘‘నిజాయితీగా అందరినీ నవ్వించడానికి చేసిన ప్రయత్నమే మా ‘గల్లీ రౌడీ’ చిత్రం. ట్రైలర్‌ చూసి చిరంజీవి గారు ‘సందీప్‌ నీకు ఇలాంటి క్యారెక్టర్స్‌ చాలా బావుంటాయి.  పాత్రలో ఒదిగిపోయావు’ అన్నారు. అది ఆయన గొప్పతనం’’ అని సందీప్‌కిషన్‌ అన్నారు. ఆయన హీరోగా నేహాశెట్టి హీరోయిన్‌గా నటి ంచిన చిత్రం ‘గల్లీరౌడీ’. రచయిత కోన వెంకట్‌ సమర్పణలో జి. నాగేశ్వరరెడ్డి దర్శకత్వంలో ఎం.వి.వి. సత ్యనారాయణ నిర్మించారు. నేడు ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇటీవలె జరిగిన ఈ చిత్రం ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌లో ఆంధ్రప్రదేశ్‌ అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్‌ కోన రఘుపతి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఆయన మాట్లాడుతూ ‘‘వెంకట్‌ ఓ స్టార్‌ రైటర్‌. ఆయన సమర్పణలో వస్తున్న ‘గల్లీరౌడీ’ పెద్ద హిట్‌ అవుతుందనే నమ్మకం ఉంది’’ అని అన్నారు. 


Follow Us on:
అంతర్జాలంలో ప్రకటనల కొరకు సంప్రదించండి
For internet advertisement and sales please contact
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.