9 నుంచి చిరంజీవి జన్మదిన వేడుకలు

ABN , First Publish Date - 2021-08-02T16:30:06+05:30 IST

సినీ నటుడు చిరంజీవి పుట్టిన రోజు సందర్భంగా ..

9 నుంచి చిరంజీవి జన్మదిన వేడుకలు

రాజమహేంద్రవరం సిటీ: సినీ నటుడు చిరంజీవి పుట్టిన రోజు సందర్భంగా ఈ నెల 9నుంచి 22వ తేదీ వరకు వివిధ సేవా కార్యక్రమాలను నిర్వహిస్తున్నామని చిరంజీవి యువత రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఏడిద బాబి తెలిపారు. ఆదివారం స్థానిక చిరంజీవి ఆక్సిజన్‌ బ్యాంకు వద్ద జరిగిన సమావేశానికి ఆయన, చిరంజీవి యువత జిల్లా అధ్యక్షుడు కత్తిపూడి బాబి ముఖ్యఅతిథులుగా విచ్చేశారు. ఏడిద బాబి మాట్లాడుతూ 9న మొక్కలు నాటే కార్యక్రమంతో చిరంజీవి జన్మదిన వేడు కలు ప్రారంభమవుతాయని, పేదలకు భోజనాలు అందించడం, రక్తదాన శిబిరాలు తదితర కార్యక్రమాలను జిల్లా వ్యాప్తంగా నిర్వహించనున్నట్టు ఆయన తెలిపారు. సమావేశంలో చిరంజీవి యువత ఉపాధ్యక్షుడు ఏడిద శ్రీను, రాష్ట్ర ఉపాధ్యక్షుడు నల్ల చిట్టి, గుండుబోతుల తాతాజీ, ఉల్లిశెట్టి లక్ష్మణరావు, సుధాచిన్న, నల్లల శివ, నాళం వరప్రసాద్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2021-08-02T16:30:06+05:30 IST