సంక్రాంతికి కలుద్దాం!

Published: Sat, 25 Jun 2022 01:24:23 ISTfb-iconwhatsapp-icontwitter-icon
సంక్రాంతికి కలుద్దాం!

వచ్చే సంక్రాంతికి ఇంకా దాదాపుగా ఏడు నెలల సమయం ఉంది. ఈలోగానే సంక్రాంతి పండక్కి బెర్తులు సిద్ధం చేసుకుంటున్నారు దర్శక నిర్మాతలు. ఈ ముగ్గుల పండక్కి కూడా పెద్ద చిత్రాలు భారీ ఎత్తున విడుదల కాబోతున్నాయి. ఈసారి చిరంజీవి సినిమా కూడా బరిలో ఉంది. చిరంజీవి కథానాయకుడిగా బాబి దర్శకత్వంలో ఓ చిత్రం రూపుదిద్దుకుంటున్న సంగతి తెలిసిందే. మైత్రీ మూవీస్‌ నిర్మిస్తోంది. శ్రుతిహాసన్‌ కథానాయిక. ‘వాల్తేరు వీరయ్య’ టైటిల్‌ పరిశీలనలో ఉంది. ఈ చిత్రాన్ని 2023 సంక్రాంతికి విడుదల చేయబోతున్నట్టు చిత్రబృందం ప్రకటించింది. ‘‘కలుద్దాం... 2023 సంక్రాంతికి’’ అంటూ ఓ పోస్టర్‌ని విడుదల చేసింది. ఇప్పటికే 40 శాతం చిత్రీకరణ పూర్తయింది. త్వరలోనే కొత్త షెడ్యూల్‌ మొదలెడతారు. ఈ చిత్రంలో మరో కథానాయకుడు కూడా కనిపించనున్నారని ముందు నుంచీ ప్రచారం జరుగుతోంది. ఆ కథానాయకడెవరన్న సస్పెన్స్‌ ఇంకా కొనసాగుతోంది. దేవిశ్రీ ప్రసాద్‌ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు. మెగా అభిమానులకు పూనకాలు తీసుకొచ్చేలా చిరు పాత్ర ఉంటుందని, పక్కా కమర్షియల్‌ ఎంటర్‌టైనర్‌గా సాగే ఈ చిత్రం అన్ని వర్గాల ప్రేక్షకులకు నచ్చుతుందని చిత్రబృందం ధీమాగా చెబుతోంది. 

Follow Us on:
ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International