మెగాస్టార్ చిరంజీవి వరుస సినిమాలను లైన్లో పెడుతున్నారు. ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో `ఆచార్య` చేస్తున్న చిరంజీవి త్వరలో `వేదాళం` రీమేక్‌ను పట్టాలెక్కిస్తారు. మరోవైపు `లూసిఫర్` రీమేక్ కూడా చేయాలనుకుంటున్నారు. అలాగే స్టార్ డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్‌తో కూడా ఓ సినిమా చేయాలనుకుంటున్నారట.
మెగా ఫ్యాన్స్ అందరూ చిరంజీవి-త్రివిక్రమ్ కాంబినేషన్ కోసమే ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అయితే ఈ సినిమా ఇప్పట్లో పట్టాలెక్కే సూచనలు కనిపించడం లేదు. త్రివిక్రమ్ త్వరలో ఎన్టీయార్ సినిమాను ప్రారంభించబోతున్నారు. ఆ తర్వాత మహేష్, వెంకటేష్, రామ్, అల్లు అర్జున్.. ఇలా త్రివిక్రమ్ లిస్ట్ పెద్దగానే కనబడుతోంది. మెగాస్టార్ కూడా వచ్చే ఏడాదిని `వేదాళం`, `లూసిఫర్` రీమేక్‌ల కోసమే కేటాయించాల్సి ఉంది. ఈ నేపథ్యంలో వీరి కాంబోలోని సినిమా ఎప్పుడు పట్టాలెక్కుతుందనే విషయంలో క్లారిటీ రావడం లేదు.