పుస్తకాలు డిజిటలైజేషన్‌

ABN , First Publish Date - 2022-07-07T04:01:19+05:30 IST

జిల్లాలోని అన్ని గ్రంథాలయాల్లో పుస్తకాల డిజిటలైజేషన్‌ ప్రక్రియ జరుగుతోందని జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్‌పర్సన్‌ దొంతు శారద తెలిపారు.

పుస్తకాలు డిజిటలైజేషన్‌
బడ్జెట్‌ సమావేశంలో మాట్లాడుతున్న చైర్‌పర్సన్‌ దొంతు శారద

గ్రంథాలయ సంస్థ చైర్‌పర్సన్‌ దొంతు శారద 

నెల్లూరు(సాంస్కృతికం), జూలై 6: జిల్లాలోని అన్ని గ్రంథాలయాల్లో పుస్తకాల డిజిటలైజేషన్‌ ప్రక్రియ జరుగుతోందని జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్‌పర్సన్‌ దొంతు శారద తెలిపారు. బుధవారం జరిగిన జిల్లా గ్రంథాలయ సంస్థ కమిటీ సమావేశంలో ఆమె మాట్లాడుతూ అవసరమైన టేబుళ్లు, కుర్చీలు కూడా ఏర్పాటు చేస్తున్నామన్నారు. రూ.3 కోట్లలో జిల్లా గ్రంథాలయం నిర్మాణ పనులు జరుగుతున్నాయని తెలిపారు. 2022-23 ఆర్థిక సంవత్సరంలో కేటాయించిన పనులు, తీసుకోవాల్సిన అనుమతులపై కమిటీ చర్చించింది. అలాగే 2022-23 సంవత్సరం బడ్జెట్‌ రూ.14 కోట్లకు ఆమోదం తెలిపారు. ఈ సమావేశంలో కార్యదర్శి కుమార్‌రాజు, సూపరింటెండెంట్‌ ప్రసాద్‌, వయోజన విద్య, పంచాయతీరాజ్‌ శాఖ అధికారులు పాల్గొన్నారు. 

Updated Date - 2022-07-07T04:01:19+05:30 IST