ప్లాస్మాదానం.. నేటి నినాదం.. ప్లాస్మాదాతలను సన్మానించిన చిరంజీవి

ABN , First Publish Date - 2020-08-08T14:31:53+05:30 IST

కరోనాను జయించి, ప్లాస్మాదానం చేసిన యోధులే అసలైన హీరోలని మెగాస్టార్‌ చిరంజీవి అన్నారు. సైబరారాబాద్‌ సీపీ సజ్జనార్‌ పిలుపు మేరకు ముందుకు వచ్చి ప్లాస్మాదానం చేసిన వారిని శుక్రవారం కమిషనరేట్‌లో సన్మానించారు. సీపీ సజ్జనార్‌, ఎస్సీఎస్సీ జనరల్‌

ప్లాస్మాదానం.. నేటి నినాదం.. ప్లాస్మాదాతలను సన్మానించిన చిరంజీవి

ఎస్సీఎస్సీని ప్రత్యేకంగా అభినందించిన మెగాస్టార్‌ 

ప్లాస్మాదానానికి ముందుకు రావాలని పిలుపు


హైదరాబాద్‌ సిటీ (ఆంధ్రజ్యోతి): కరోనాను జయించి, ప్లాస్మాదానం చేసిన యోధులే అసలైన హీరోలని మెగాస్టార్‌ చిరంజీవి అన్నారు. సైబరారాబాద్‌ సీపీ సజ్జనార్‌ పిలుపు మేరకు ముందుకు వచ్చి ప్లాస్మాదానం చేసిన వారిని శుక్రవారం కమిషనరేట్‌లో సన్మానించారు. సీపీ సజ్జనార్‌, ఎస్సీఎస్సీ జనరల్‌ సెక్రటరీ కృష్ణ ఏదులతో కలిసి చిరంజీవి ప్లాస్మా దాతలను సన్మానించి, వారి కుటుంబసభ్యులను అభినందించా రు. ప్లాస్మాదానం గురించి సొసైటీ ఫర్‌ సైబరాబాద్‌ సెక్యూరిటీ కౌన్సిల్‌ (ఎస్సీఎస్సీ)- సైబరాబాద్‌ పోలీ్‌సలు రూపొందించిన కరపత్రాన్ని ఆవిష్కరించారు. చిరంజీవి మాట్లాడుతూ తాను ఎన్నో కార్యక్రమాలకు, సమావేశాలకు వెళ్తుంటానని, అక్కడ ఏదో ఒకటి మాడ్లాడి వస్తుంటానని, అయితే ఈ కార్యక్రమం తనకు ఎంతో ప్రత్యేకమైందని, ఎంతో బాధ్యతాయుతమైనదని అన్నారు. ప్రపంచాన్ని గడగడలాడిస్తోన్న కరోనా వంటి విపత్కర పరిస్థితుల్లో కూడా పోలీసు శాఖ విధులు నిర్వర్తించి ప్రజలకు అండగా నిలిచిందని అభినందించారు.


తమ పని తాము చూసుకోకుండా కరోనా బాధితుల ప్రాణాలు కాపాడే బాధ్యతను తలకెత్తుకుని, అదో యజ్ఞంలా చేయడం గొప్ప విషయమన్నారు. ప్లాస్మాదానం అనే కార్యక్రమానికి పునాది వేసి, వందలాది మంది ప్రాణాలు కాపాడుతున్న సీపీ సజ్జనార్‌ అసలైన హీరోగా అభివర్ణించారు. తన వంతు బాధ్యతగా ట్విటర్‌లో ప్రచారం చేస్తున్నానని చిరంజీవి చెప్పారు. ప్లాస్మా ఇద్దాం.. ప్రాణం పోద్దాం అన్న నినాదానికి మద్దతు పెరుగుతోంది. ఈ లక్ష్య సాధనలో సైబరాబాద్‌ పోలీసుల చొరవకు తారాబలం తోడయింది. శుక్రవారం ప్లాస్మాదానం సన్మాన కార్యక్రమం ఉత్తేజభరితంగా సాగింది. 

Updated Date - 2020-08-08T14:31:53+05:30 IST