చిరు.. చరణ్‌ స్టెప్పులు

Sep 17 2021 @ 00:39AM

చిరంజీవి, రామ్‌చరణ్‌ కలసి తొలిసారి పూర్తిస్థాయి పాత్రలు పోషిస్తున్న చిత్రం ‘ఆచార్య’. కొరటాల శివ దర్శకుడు. ఈ చిత్రం తుది దశ చిత్రీకరణ బుధవారం హైదరాబాద్‌ శివార్లలో ప్రారంభమైంది. ఇంకా రెండు పాటలు, కొంత ప్యాచ్‌వర్క్‌ మిగిలి ఉంది. ప్రత్యేకంగా వేసిన సెట్‌లో చిరంజీవి, రామ్‌చరణ్‌ పై అభిమానులను అలరించేలా ఒక స్పెషల్‌  సాంగ్‌ను, పూజాహెగ్డే, చరణ్‌పై మరోపాటను ఈ షెడ్యూల్‌లో చిత్రీకరించనున్నారు. ఈ నెలాఖరులోగా ‘ఆచార్య’ షూటింగ్‌ పూర్తిచేసి కొత్త విడుదల తేదీని ప్రకటిస్తారని తెలిసింది. ఈ చిత్రానికి మణిశర్మ సంగీతం అందిస్తున్నారు. రామ్‌చరణ్‌, నిరంజన్‌ రెడ్డి నిర్మిస్తున్నారు.  


Follow Us on:
అంతర్జాలంలో ప్రకటనల కొరకు సంప్రదించండి
For internet advertisement and sales please contact
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.