సేవకు ప్రతిరూపం.. స్త్రీమూర్తులు

ABN , First Publish Date - 2021-10-25T06:45:02+05:30 IST

సేవలకు ప్రతి రూ పం స్త్రీ మూర్తులని, కొవిడ్‌ సమయంలో వారు చేసిన సేవలు ఎనలేనివని అఖిల భారత చిరంజీవి యువత రాష్ట్ర అధ్యక్షుడు భవానీ రవికుమార్‌ కొనియాడారు.

సేవకు ప్రతిరూపం.. స్త్రీమూర్తులు

త్వరలో మెగా డిజిటల్‌ కమిటీల ఏర్పాటు

అఖిల భారత చిరంజీవి యువత రాష్ట్ర అధ్యక్షుడు భవానీ రవికుమార్‌

అనంతపురం క్రైం, అక్టోబరు 24: సేవలకు ప్రతి రూ పం స్త్రీ మూర్తులని, కొవిడ్‌ సమయంలో వారు చేసిన సేవలు ఎనలేనివని అఖిల భారత చిరంజీవి యువత రాష్ట్ర అధ్యక్షుడు భవానీ రవికుమార్‌ కొనియాడారు. ఆదివారం స్థానిక శ్రీనివాసనగర్‌లోని బలిజ కళ్యాణ మండపంలో కొవిడ్‌ సమయంలో విశేష సేవలందించిన పలువురు మహిళలను సన్మానించిన ఆయన మాట్లాడారు. ఆపద సమయంలో సేవలందించిన వారిని ప్రోత్సహించాలని మెగాస్టార్‌ చిరంజీవి ఆకాంక్ష మేరకు ఈ కార్యక్రమాన్ని చేపట్టామన్నారు. త్వరలో మెగాస్టార్‌ చిరంజీవి నటించిన ఆచార్య సినిమా విడుదల నేపథ్యంలో మండల, గ్రామ స్థాయిలో చిత్ర విశేషాలను తీసుకెళ్లడం కోసం త్వరలో మెగా డిజిటల్‌ కమిటీలను ఏర్పాటు చేస్తామన్నారు. ఆసక్తి ఉన్న మెగా అభిమానులు తమ వివరాలతో తమను సంప్రదించాలని కోరారు. భవిష్యతలో కూడా మరిన్ని సేవాకార్యక్రమాలు చేపడుతామన్నారు. కార్యక్రమంలో మెగా అభిమానులు చంద్రమౌళి, సురేష్‌, షామిర్‌, రమేష్‌, ఇమామ్‌ హూసేన, ఎస్కేయూ రమణ, గల్లా హర్ష,చిన్న, విజయ్‌, సాయి, తాడిపత్రి మురళి, అబ్దుల్‌, పత్తి చంద్రశేఖర్‌, సంజీవరాయుడు, సత్య పాల్గొన్నారు.  


Updated Date - 2021-10-25T06:45:02+05:30 IST