చిత్తూరు: జిల్లాలోని సదుం మండలం జాండ్రపేటలో అక్కాతమ్ముడు దారుణ హత్యకు గురయ్యారు. అక్క రాధ, తమ్ముడు నరసింహులు హత్యకు గురైనట్లు పోలీసులు గుర్తించారు. గత అర్ధరాత్రి హత్య జరిగింది. సమాచారం అందిన వెంటనే పోలీసులు అక్కడకు చేరుకుని మృతదేహాలను స్వాధీనం చేసుకున్నారు. కుటుంబ కలహాల కారణంగానే రాధ భర్తకు దూరంగా ఉంటోంది. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. కాగా హత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది.
ఇవి కూడా చదవండి