Chittoor: పూర్తి నీటిమట్టానికి చేరిన కల్యాణి జలాశయం

ABN , First Publish Date - 2021-11-19T15:39:41+05:30 IST

జిల్లా వ్యాప్తంగా భారీ వర్షాల కారణంగా వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. వరద నీరు ఎక్కువగా చేరడంతో కల్యాణి జలాశయం పూర్తి నీటిమట్టానికి చేరింది.

Chittoor: పూర్తి నీటిమట్టానికి చేరిన కల్యాణి జలాశయం

చిత్తూరు: జిల్లా వ్యాప్తంగా భారీ వర్షాల కారణంగా వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. వరద నీరు ఎక్కువగా చేరడంతో కల్యాణి జలాశయం నీటిమట్టం పూర్తిస్థాయికి చేరింది.  దీంతో అధికారులు కల్యాణి జలాశయం నుంచి 1200 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేశారు. అటు పాలసముద్రంలో వెంగళరాజకుప్పం చెరువు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. పెద్దచెరువు కాలువ పొంగడంతో 12 గ్రామాలకు  రాకపోకలు నిలిచిపోయాయి. మరోవైపు భారీ వర్షాల కారణంగా నేడు విద్యాసంస్థలకు కలెక్టర్ సెలవు ప్రకటించారు. 

Updated Date - 2021-11-19T15:39:41+05:30 IST