AP: చిన్నేరు నీటి ప్రవాహంలో కొట్టుకుపోయిన బాలుడు

ABN , First Publish Date - 2021-11-24T14:55:46+05:30 IST

జిల్లాలోని చిన్నేరు నీటి ప్రవాహంలో నాలుగేళ్ల బాలుడు కొట్టుకుపోయాడు.

AP: చిన్నేరు నీటి ప్రవాహంలో కొట్టుకుపోయిన బాలుడు

చిత్తూరు: జిల్లాలోని చిన్నేరు నీటి ప్రవాహంలో నాలుగేళ్ల బాలుడు కొట్టుకుపోయాడు. వేపలపల్లి వద్ద బ్రిడ్జిపై ఇద్దరు కొడుకులతో ద్విచక్ర వాహనంలో రోడ్డు దాటుతుండగా చిన్నారి నీటి ప్రవాహంలో పడిపోయాడు. సదుం మండలానికి చెందిన శ్రీరాములు నాలుగేళ్ళ కొడుకు ప్రవాహంలో కొట్టుకుపోయినట్లు గుర్తించారు. సమాచారం అందిన వెంటనే పోలీసులు, స్థానికులు అక్కడకు చేరుకుని చిన్నారి కోసం గాలింపు చర్యలు చేపట్టారు. 

Updated Date - 2021-11-24T14:55:46+05:30 IST