జలదిగ్బంధంలోనే చిత్తూరు కాలనీలు

ABN , First Publish Date - 2021-11-24T06:57:58+05:30 IST

ఇటీవల కురిసిన భారీ వర్షాలకు చిత్తూరు నగరంలోని పలు కాలనీలు మంగళవారం వరకు కూడా జలదిగ్బంధంలోనే ఉన్నాయి.

జలదిగ్బంధంలోనే చిత్తూరు కాలనీలు
తేనబండ

నీవానది ఉధృతిలో చిక్కుకుని ఇబ్బంది పడుతున్న జనం


చిత్తూరు, నవంబరు 23: ఇటీవల కురిసిన భారీ వర్షాలకు చిత్తూరు నగరంలోని పలు కాలనీలు మంగళవారం వరకు కూడా జలదిగ్బంధంలోనే ఉన్నాయి. నీవానది వరద ఉధృతి కొనసాగుతుండటంతో తేనబండ, తోటపాళ్యం, ఇంద్రానగర్‌, వీరభద్రకాలనీవాసులు నీటిలో చిక్కుకుని ఇబ్బంది పడుతున్నారు. అధికారులు తమకు మూడు పూటలా భోజనాలు పెడుతున్నారే తప్ప, నీటిని తొలగించే చర్యలు చేపట్టడం లేదని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పైభాగంలో ఉన్న బ్రిడ్జి కింద పేరుకుపోయిన చెత్త, ముళ్ల కంపలను తొలగిస్తే వీధుల్లో పారే నీరంతా నీవానదిలోకి పోతుందని చెబుతున్నారు. ఆ దిశగా అధికారులు చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. 





Updated Date - 2021-11-24T06:57:58+05:30 IST