చిత్తూరు జిల్లాలో దారుణం

Sep 15 2021 @ 11:43AM

చిత్తూరు: జిల్లాలో దారుణం జరిగింది. ఇద్దరు చిన్నారులపై లైంగిక దాడికి యత్నం కలకలం రేపింది. బి.కొత్తకోట ఇందిరమ్మ కాలనీలో ఈ ఘటన జరిగింది. చిన్నారులు కేకలు వేయడంతో స్థానికులు అప్రమత్తమయ్యారు. నిందితుడిని పట్టుకుని, చెట్టుకు కట్టేసి చితక్కొట్టారు. అనంతరం పోలీసులకు అప్పగించారు. అభం శుభం తెలియని ఇద్దరు చిన్నారులపై స్థానికంగా ఉండే అనిల్ కుమార్ అనే వ్యక్తి ఈ దారుణానికి పాల్పడ్డాడు. పూర్తి సమాచారం అందవలసి ఉంది.

Follow Us on:
అంతర్జాలంలో ప్రకటనల కొరకు సంప్రదించండి
For internet advertisement and sales please contact
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.