Chittoor జిల్లాలో భూమి కబ్జా.. మంత్రి పెద్దిరెడ్డికి చెప్పినా..!

ABN , First Publish Date - 2022-08-15T00:17:24+05:30 IST

పులిచర్ల మండలం మంగళంపేట కాలనీలో దారుణం జరిగింది. తస్లిం అనే మహిళ (Women)కు పదేళ్లక్రితం ఓ వ్యక్తితో...

Chittoor జిల్లాలో భూమి కబ్జా.. మంత్రి పెద్దిరెడ్డికి చెప్పినా..!

చిత్తూరు (chittoor): పులిచర్ల మండలం మంగళంపేట కాలనీలో దారుణం జరిగింది. తస్లిం అనే మహిళ (Women)కు పదేళ్లక్రితం ఓ వ్యక్తితో వివాహం జరిగింది. ఆ దంపతులకు ఇద్దరు ఆడ పిల్లలు పుట్టారు. దీంతో భార్యా పిల్లలను భర్త వదిలేసి వెళ్లిపోయారు. వేరే మహిళతో సహజీవనం చేస్తున్నారు.


అయితే ఎవరి మీద ఆధారపడకుండా ఉండేందుకు తస్లిం తన పుట్టింటి వారిచ్చిన భూమిని సాగు చేసుకుంటూ కూతురుని చదివిస్తోంది. భూమిపై కన్నేసిన భర్త దాన్ని కబ్జా చేసేందుకు ప్లాన్ చేశాడు. అందులో కొంత భూమిని తన పేరుపై దొంగ పట్టా తెచ్చుకుని అనుభవిస్తూ చాలా రకాలుగా తమను చిత్ర హింసలు గురి చేస్తున్నారని వారు ఆరోపించారు. ఈ విషయాన్ని రెవెన్యూ, పోలీసుల వద్ద ఎన్నిసార్లు తీసుకెళ్లినా న్యాయం చేయలేదని ఆవేదన వ్యక్తం చేశారు.


సమస్యను సాక్షాత్తు మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి (Minister PeddiReddy Ramachandra Reddy) వద్దకు తీసుకు వెళ్లినా ప్రయోజనం లేకుండా పోయిందని వాపోయారు. తమకు న్యాయం జరగకపోతే ఆత్మహత్యే శరణ్యమని చెబుతున్నారు. 



Updated Date - 2022-08-15T00:17:24+05:30 IST