Chittoorలో ఓ మోస్తరుగా తగ్గుముఖం పట్టిన వర్షం

ABN , First Publish Date - 2021-11-20T14:07:27+05:30 IST

గత రెండు రోజులుగా జిల్లాను అతలాకుతలం చేస్తున్న వర్షం రాత్రి ఓ మోస్తరుగా తగ్గుముఖం పట్టింది.

Chittoorలో ఓ మోస్తరుగా తగ్గుముఖం పట్టిన వర్షం

చిత్తూరు: గత రెండు రోజులుగా జిల్లాను అతలాకుతలం చేస్తున్న వర్షం రాత్రి ఓ మోస్తరుగా తగ్గుముఖం పట్టింది. కాగా వరద ఉధృతి కొనసాగుతోంది. అనేక గ్రామలు జలదిగ్బంధంలోనే ఉన్నాయి. బంగారుపాలెం మండలం టేకుమంద వద్ద వాగులో కొట్టుకుపోయి  నలుగురు మహిళలు గల్లంతయ్యారు. ఒక మహిళ మృతదేహం లభ్యం కాగా...ముగ్గురి కోసం గాలింపు కొనసాగుతోంది. అటు పుంగనూరు పట్టణంలో వరద ఉధృతి తగ్గని పరిస్థితి నెలకొంది. రోడ్లన్నీ జలమయమవడంతో రాకపోకలకు అంతరాయం ఏర్పడింది.


మదనపల్లి రోడ్డులోని ట్రావెల్స్ బంగ్ల నుండి పోలీస్ స్టేషన్ వరకు, కొత్తపేట సర్కిల్ నుండి పోలీస్ స్టేషన్ వరకు నీటి ప్రవాహం కొనసాగుతోంది. పుంగనూరును అనుకొని ఉన్న అగ్రహారం చెరువు ఏ క్షణమైనా తెగవచ్చు అని ప్రజలు ఆందోళన చెందుతున్నారు. లోతట్టు ప్రాంతంలోని ప్రజలందరూ జాగ్రత్తగా ఉండాలని హెచ్చరికలు జారీ చేశారు. మరోవైపు  ముఖ్యమంత్రి జగన్ ఈరోజు హెలికాప్టర్ ద్వారా ఏరియల్ సర్వే నిర్వహించనున్నారు. భారీ వర్షాల నేపథ్యంలో జిల్లా యంత్రాంగం ఈరోజు కూడా విద్యా సంస్థలకు సెలవు ప్రకటించింది. 

Updated Date - 2021-11-20T14:07:27+05:30 IST