వినోదభరితంగా ‘ఛూ.. మందిరకాళి’

Sep 16 2021 @ 19:43PM

నూతన హీరో కార్తికేయన్‌ వేలు - కన్నడ నటి సంజనా బుర్లి హీరోయిన్‌గా కోలీవుడ్‌కు పరిచయమవుతూ నటిస్తున్న చిత్రం ‘ఛూ.. మందిరకాళి’. ఈశ్వర్‌ కొట్రవై ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. ప్రస్తుతం ఈ మూవీ ఒకవైపు శరవేగంగా షూటింగ్‌ జరుపుకుంటూనే మరోవైపు ప్రమోషన్‌ కార్యక్రమాలను కూడా చేపట్టింది. 


ఈ నేపథ్యంలో ఈ చిత్రం కథ గురించి దర్శకుడు ఈశ్వర్‌ కొట్రవై మాట్లాడుతూ.. ‘‘ఈ చిత్ర టైటిల్‌ను చూసి ఇది ఒక దెయ్యం కథగా భావించవద్దు. పూర్తి హాస్యభరితమైన, రసభరితమైన ఫాంటసీ సినిమా. ధర్మపురి పరిసర ప్రాంతాల్లో ఈ చిత్రం షూటింగ్‌ను జరిపాం. ధర్మపురి అడవుల్లో ఈ చిత్రం షూటింగ్‌ జరుగుతున్న సమయంలో ఒక ఏనుగు లొకేషన్‌ స్పాట్‌కు వచ్చి యూనిట్‌ సభ్యులందరినీ పరుగులు పెట్టించింది. ఈ చిత్రం ప్రత్యేకత ఏంటంటే.. ఇందులో కిషోర్‌ దేవ్‌ అనే నటుడు ఆడ వేషంలో నటించారు. ఆ పరిసర ప్రాంతాలకు చెందిన ప్రజలంతా నిజంగానే ఆయన్ను మహిళగా భావించారు. యూనిట్‌ సభ్యుల్లో ఒక లైట్‌మ్యాన్‌.. అతని స్త్రీ వేషానికి ముగ్ధుడై నిజంగానే కిడ్నాప్‌ చేశాడు. ఆ తర్వాత అతనికి వివరించి చెప్పి కిషోర్‌ దేవ్‌ను విడిపించడం జరిగింది. నిర్మాణాంతర కార్యక్రమాలను పూర్తి చేసుకుని త్వరలోనే విడుదల చేస్తాం’’ అని వెల్లడించారు. 


Follow Us on:
అంతర్జాలంలో ప్రకటనల కొరకు సంప్రదించండి
For internet advertisement and sales please contact
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.