‘పాఠశాలలకు సెలవులు ప్రకటించాలి’

ABN , First Publish Date - 2022-01-20T04:20:50+05:30 IST

కరోనా మహమ్మారి కోరలు చాస్తున్న ప్రస్తుత పరిస్థితుల్లో విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడవద్దని టీఎన్‌ఎస్‌ఎఫ్‌ నాయకులు కోరారు.

‘పాఠశాలలకు సెలవులు ప్రకటించాలి’
డీఈవోకు వినతిపత్రం అందజేస్తున్న టీఎన్‌ఎస్‌ఎఫ్‌ నాయకులు

కర్నూలు(అగ్రికల్చర్‌), జనవరి 19: కరోనా మహమ్మారి కోరలు చాస్తున్న ప్రస్తుత పరిస్థితుల్లో విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడవద్దని  టీఎన్‌ఎస్‌ఎఫ్‌ నాయకులు కోరారు. డీఈవో రంగారెడ్డికి బుధవారం వినతిపత్రం అందజేశారు. పాఠశాలలకు సెలవులు ప్రకటించాలని కోరారు. అనంతరం విలేకరులతో మాట్లాడుతూ పక్క రాష్ట్రాల్లో విద్యార్థుల ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని రెండు వారాల పాటు సెలవులు ప్రకటించారని, మన రాష్ట్రంలో కరోనా ఉధృతి ఎక్కువగా ఉండి కూడా ముఖ్యమంత్రి జగన్‌  మొండిగా వ్యవహరిస్తున్నారని అన్నారు. ఇప్పటికైనా ముఖ్యమంత్రి, విద్యాశాఖ మంత్రి కళ్లు తెరిచి వెంటనే పాఠశాలలకు సెలవులు ప్రకటించాలని డిమాండ్‌ చేశారు. లేదంటే టీఎన్‌ఎస్‌ఎఫ్‌ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు చేస్తామని హెచ్చరించారు. టీఎన్‌ఎస్‌ఎఫ్‌ రాష్ట్ర అధికార ప్రతినిధి రెడ్డిపోగు బజారన్న, కర్నూలు లోక్‌సభ నియోజకవర్గ అధ్యక్షుడు రామాంజనేయులు, కార్యదర్శి బొగ్గుల ప్రవీణ్‌ ఉన్నారు. 

Updated Date - 2022-01-20T04:20:50+05:30 IST