ఆర్టీసీ చార్జీల పెంపుపై టీడీపీ ఆగ్రహం

ABN , First Publish Date - 2022-07-03T06:38:13+05:30 IST

ఆర్టీసీ బస్సు చార్జీల పెంపుపై టీడీపీ శ్రేణులు జిల్లా వ్యాప్తంగా భిన్నమైన నిరసనలతో హోరెత్తించాయి. పార్టీ జిల్లా అధ్యక్షుడు కాలవ శ్రీనివాసులు పిలుపు మేరకు నాయకులు, కార్యకర్తలు ధర్నాలు నిర్వహించారు.

ఆర్టీసీ చార్జీల పెంపుపై టీడీపీ ఆగ్రహం

నిరసనల హోరు..

బస్సుల్లో ప్రయాణించి.. ప్రజల్లో చైతన్యం

ఆర్టీసీ బస్సు చార్జీల పెంపుపై టీడీపీ శ్రేణులు జిల్లా వ్యాప్తంగా భిన్నమైన నిరసనలతో హోరెత్తించాయి. పార్టీ జిల్లా అధ్యక్షుడు కాలవ శ్రీనివాసులు పిలుపు మేరకు నాయకులు, కార్యకర్తలు ధర్నాలు నిర్వహించారు. చార్జీలను తక్షణం తగ్గించాలని డిమాండ్‌ చేశారు. అనంతపురం ఆర్టీసీ బస్టాండ్‌ ఎదుట మాజీ ఎమ్మెల్యే వైకుంఠం ప్రభాకర్‌ చౌదరి ఆధ్వర్యంలో నిరసన తెలిపారు. నాయకులతో కలిసి పామిడి దాకా ఆర్టీసీ బస్సులో ప్రయాణించి, చార్జీల పెంపు గురించి ప్రయాణికులను చైతన్యపరిచారు. 

- అనంతపురం అర్బన



- తెలుగు యువత రాష్ట్ర అధికార ప్రతినిధి దండు శ్రీనివాసులు, శింగనమల మండల నాయకులు మారుతీనాయుడు ఆధ్వర్యంలో నిరసన చేశారు. ద్విసభ్య కమిటీ సభ్యులు ఆలం నరసానాయుడు, ముంటిమడుగు కేశవరెడ్డి, పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి శ్రీధర్‌ చౌదరి హాజరయ్యారు.  అనంతపురం పాతూరు తాడిపత్రి బస్టాండ్‌  నుంచి నాయనపల్లి క్రాస్‌ దాకా బస్సులో ప్రయాణించి, ప్రయాణికులకు పెంచిన చార్జీలపై వివరించి చైతన్యం నింపారు. 


- గుంతకల్లు ఆర్టీసీ బస్టాండ్‌లో పార్టీ రాష్ట్ర కార్యదర్శి వెంకటశివుడు యాదవ్‌  ఆధ్వర్యంలో నిరసన తెలిపారు. ప్రయాణికులను కలిసి చార్జీల పెంపు గురించి వివరించారు. 


- కళ్యాణదుర్గంలో పార్టీ నియోజకవర్గ ఇనచార్జి ఉమామహేశ్వరనాయుడు ఆధ్వర్యంలో బస్టాండ్‌ ఎదుట బైఠాయించారు. చెవులో పూలు పెట్టుకుని ప్రయాణికులకు అవగాహన కల్పిస్తూ బస్సులో ప్రయాణించారు. 



- టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఉన్నం హనుమంతరాయ చౌదరి, ఆయన తనయుడు ఉన్నం మారుతీ చౌదరి ఆధ్వర్యంలో ఆర్టీసీ బస్టాండ్‌ ఎదుట ఆందోళన చేశారు. ఆర్టీసీ బస్సులో ప్రయాణించి ప్రయాణికులకు అవగాహన కల్పించారు. 

- కంబదూరులో టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి కరణం రామ్మోహన చౌదరి  ఆధ్వర్యంలో ఆర్టీసీ బస్సులను నిలిపేసి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. బస్సులో ప్రయాణించి చార్జీల పెంపుపై ప్రయాణికులకు అవగాహన కల్పించారు. 


Updated Date - 2022-07-03T06:38:13+05:30 IST