
ప్రముఖ మలయాళ దర్శకుడు అనిల్ (Dairector Anil) తొలిసారి ఒక తమిళ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. దమోర్ సినిమాస్ బ్యానరులో సంతోష్ దామోదరన్ (Santhosh damodaran) నిర్మాణంలో సౌందరరాజ (Saundararaja), దేవానందా (Devananda) ప్రధాన పాత్రల్లో తెరకెక్కించే ఈ చిత్రానికి ‘సాయావనం’ (Saayavanam) అనే టైటిల్ ఫిక్స్ చేశారు. మలయాళంలో దాదాపు 40కి పైగా చిత్రాలకు దర్శకత్వం వహించిన అనిల్... పలువురు అగ్ర హీరోలతో కలిసి పనిచేశారు. ‘కడైకుట్టి సింగం’, ‘ధర్మదురై’, ‘సుందర పాండియన్’ వంటి చిత్రాల్లో నటించి మంచి గుర్తింపు పొందిన సౌందరరాజ ఈ చిత్రంలో హీరోగా నటిస్తున్నారు.

ఈ సినిమా గురించి దర్శకుడు అనిల్ మాట్లాడుతూ.. ‘నా తొలి తమిళ సినిమా ఎంట్రీకి భిన్నమైన స్ర్కిప్టు కావాలనే ఈ స్టోరీ ఎంచుకున్నాను. హీరోయిన్ దేవానందా పోషించే సీత పాత్ర చుట్టూ ఈ కథ సాగుతుంది. ఇందులోని సగభాగం చిరపుంజిలో మంచు, వర్షం, అటవీ ప్రాంతాల బ్యాక్డ్రాప్లో చిత్రీకరించాం. జాతీయ అవార్డులు పొందిన ‘కర్ణన్’ ఫేం జానకి కీలక పాత్రలను పోషించారు’ అని వివరించారు.