రెండేళ్ల తర్వాత.. విండీస్‌ జట్టులో గేల్‌

ABN , First Publish Date - 2021-02-28T09:39:45+05:30 IST

వెటరన్‌ బ్యాట్స్‌మన్‌ క్రిస్‌ గేల్‌కు దాదాపు రెండేళ్ల సుదీర్ఘ విరామం తర్వాత వెస్టిండీస్‌ జట్టులో చోటు దక్కింది. శ్రీలంకతో జరిగే మూడు టీ20ల సిరీ్‌సకు శనివారం ప్రకటించిన విండీస్‌ జట్టుకు 41 ఏళ్ల గేల్‌ను ఎంపిక చేశారు...

రెండేళ్ల తర్వాత.. విండీస్‌ జట్టులో గేల్‌

సెయింట్‌జాన్స్‌: వెటరన్‌ బ్యాట్స్‌మన్‌ క్రిస్‌ గేల్‌కు దాదాపు రెండేళ్ల సుదీర్ఘ విరామం తర్వాత వెస్టిండీస్‌ జట్టులో చోటు దక్కింది. శ్రీలంకతో జరిగే మూడు టీ20ల సిరీ్‌సకు శనివారం ప్రకటించిన విండీస్‌ జట్టుకు 41 ఏళ్ల గేల్‌ను ఎంపిక చేశారు. 2019లో భారత్‌తో జరిగిన సిరీ్‌సలో అతడు చివరిసారి జాతీయ జట్టుకు ప్రాతినిధ్యం వహించాడు. అలాగే సీనియర్‌ పేసర్‌ ఫిడెల్‌ ఎడ్వర్డ్స్‌ (39) తొమ్మిది సంవత్సరాల తర్వాత జట్టులో పునరాగమనం చేయడం గమనార్హం. లంకతో మూడు టీ20లు మార్చి 3, 5, 7 తేదీల్లో ఆంటిగ్వాలో జరగనున్నాయి.

Updated Date - 2021-02-28T09:39:45+05:30 IST