కోక్‌ వద్దు.. నీళ్లు తాగండి!

Jun 16 2021 @ 01:11AM

బుడాపెస్ట్‌ (హంగేరీ): పోర్చుగల్‌ సాకర్‌ స్టార్‌ క్రిస్టియానో రొనాల్డో మరో వివాదంలో చిక్కుకున్నాడు. ‘యూరో 2020’ గేమ్స్‌లో మంగళవారం హంగేరితో మ్యాచ్‌కు ముందు కోచ్‌ ఫెర్నాండో సాంటో్‌సతో కలిసి కెప్టెన్‌ రొనాల్డో మీడియా సమావేశంలో పాల్గొన్నాడు. ఈ సందర్భంగా టేబుల్‌పై రెండు కోకాకోలా బాటిళ్లు ఉండడాన్ని రొనాల్డో గమనించాడు. వాటిని పక్కనపెట్టేసిన రొనాల్డో శీతల పానీయాల బదులు అందరూ మంచి నీళ్లు తాగండంటూ వాటర్‌ బాటిల్‌ చూపిస్తూ సలహా ఇవ్వడం వివాదాస్పదమైంది. ఈ వీడియో నెట్‌లో హల్‌చల్‌ చేస్తోంది. యూరో గేమ్స్‌కు కోకాకోలా అధికారిక స్పాన్సర్‌ కావడం గమనార్హం. ఇప్పటికైతే రొనాల్డోపై నిర్వాహకులు ఎలాంటి చర్యా తీసుకోలేదు. 

Follow Us on:
అంతర్జాలంలో ప్రకటనల కొరకు సంప్రదించండి
For internet advertisement and sales please contact
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.