క్రిస్మస్‌ ట్రీ ఇలా చేయాలి!

ABN , First Publish Date - 2020-12-24T05:56:12+05:30 IST

క్రిస్మస్‌ ట్రీ ఇలా చేయాలి!

క్రిస్మస్‌ ట్రీ ఇలా చేయాలి!

కావలసినవి

ఆకుపచ్చ రంగు డెకరేటివ్‌ పేపర్‌

వెడల్పాటి బౌల్‌

జిగురు 

కత్తెర

రంగు రంగుల పూసలు


ఇలా చేయాలి!

ముందుగా డెకరేటివ్‌ పేపర్‌ తీసుకుని దానిపై బౌల్‌  పెట్టి వృత్తం గీసుకోవాలి. బౌల్‌ కాకుండా వృత్తమాలినితో కూడా గీసుకోవచ్చు. 

తరువాత పేపర్‌ను కట్‌ చేసుకోవాలి. వృత్తాకారంలో ఉన్న పేపర్‌ ఇప్పుడు మీ చేతిలో ఉంది. ఆ పేపర్‌ను మధ్యలోకి మడవండి. ఆ మడిచిన భాగం వెంట కట్‌ చేయండి. ఇప్పుడు వృత్తం రెండు భాగాలయింది.

ఒక భాగాన్ని తీసుకుని కోన్‌లా మడవండి. జిగురు సహాయంతో అతికించండి. 

ఇప్పుడు రంగు రంగుల పూసలు అతికించండి. కోన్‌ పైభాగంలో మెరుపు కాగితాన్ని అతికిస్తే క్రిస్మస్‌ ట్రీ మరింత ఆకర్షణీయంగా ఉంటుంది.

మీరు కట్‌ చేసుకున్న వృత్తం సైజును బట్టి క్రిస్మస్‌ ట్రీ తయారవుతుంది. 

Updated Date - 2020-12-24T05:56:12+05:30 IST