నూతన వ్యవసాయ చట్టాలు రద్దు చేయాలి

ABN , First Publish Date - 2020-12-03T05:47:54+05:30 IST

వ్యవసాయ వ్యతిరేక చట్టాలను కేంద్ర ప్రభుత్వం రద్దుచేయాలని వివిధ పార్టీల నాయకులు డిమాండ్‌ చేశారు.

నూతన వ్యవసాయ చట్టాలు రద్దు చేయాలి
హుజూర్‌నగర్‌లోని ఆర్డీవో కార్యాలయం ఎదుట ధర్నా రైతు సంఘాలు, వివిధ పార్టీల నాయకులు

హుజూర్‌నగర్‌/ సూర్యాపేట టౌన్‌, డిసెంబరు 2: వ్యవసాయ వ్యతిరేక చట్టాలను కేంద్ర ప్రభుత్వం రద్దుచేయాలని వివిధ పార్టీల నాయకులు డిమాండ్‌ చేశారు. ఢిల్లీలో ఆందోళన చేస్తున్న రైతులకు మద్దతుగా హుజూర్‌నగర్‌లోని ఆర్డీవో కార్యాలయం ఎదుట సీపీఐ, సీపీఎం, టీడీపీ, కాంగ్రెస్‌, సీపీఐఎంఎల్‌ న్యూడెమొక్రసీ పార్టీలు, రైతు సంఘాల ఆధ్వర్యంలో బుధవా రం ధర్నా నిర్వహించారు. వ్యవసాయ వ్యతిరేక చట్టాలు చేసి రైతులను గందరగోళానికి గురిచేయడం సరికాదన్నారు. ఇందిరా సెంటర్‌లో రాస్తారోకో చేశారు. కార్యక్రమంలో నాయకులు సూర్యనారాయణ, తన్నీరు మల్లిఖారు న్‌రావు, పులించితల వెంకట్‌రెడ్డి, నాగారపు పాండు, చావ సహదేవరావు, సాయిరాం, గుండు వెంకటేశ్వర్లు, బాబు పాల్గొన్నారు. హుజూర్‌నగర్‌లో జరిగిన సమావేశంలో రైతు సంఘం జిల్లా అధ్యక్షుడు బుర్రి శ్రీరాములు, సీపీఎం జిల్లా కమిటీ సభ్యులు పులిచింతల వెంకటరెడ్డి, నాగారపు పాండు మా ట్లాడారు. రైతు వ్యతిరేక మోదీ ప్రభుత్వాన్ని గద్దె దించాలన్నారు. కార్య క్రమంలో రోషపతి, మురళి, వెంకటనారాయణ, వెంకన్న, సోమయ్య, వీరస్వామి, వెంకన్న, వీరయ్య, వీరబాబు పాల్గొన్నారు. సూర్యాపేటలో జరిగిన సమావేశంలో తెలంగాణ రైతు సంఘం జిల్లా కార్యదర్శి మల్లు నాగార్జునరెడ్డి మాట్లాడారు. ఢిల్లీలో రైతుల పోరాటానికి మద్దతుగా ప్రజాసంఘాల ఆధ్వర్యంలో గురువారం జరిగే రాస్తారోకోను జయప్రదం చేయాలని కోరారు. కేంద్ర ప్రభుత్వం రైతులతో చర్చలు జరిపి రైతుల డిమాండ్లకు అంగీకరించకపోవడం అన్యాయమన్నారు. కార్యక్రమంలో నాయకులు కొలిశెట్టి యాదగిరిరావు, మట్టిపల్లి సైదులు, కోటగోపి, నరసింహరావు, శ్రీకాంత్‌, ఎల్గూరి గోవింద్‌, వెంకట్‌రెడ్డి, శేఖర్‌, రవి, రజిత, నరసయ్య పాల్గొన్నారు.


Updated Date - 2020-12-03T05:47:54+05:30 IST