సీఐ నాగేశ్వర్ కేసు విచారణ వేగవంతం

ABN , First Publish Date - 2022-07-14T20:05:55+05:30 IST

సీఐ నాగేశ్వర్ కేసు విచారణను అధికారులు వేగవంతం చేశారు. 10 రోజులు పోలీస్ కస్టడీ కోరుతూ వనస్థలిపురం పోలీసులు పిటిషన్ దాఖలు చేశారు.

సీఐ నాగేశ్వర్ కేసు విచారణ వేగవంతం

Hyderabad : సీఐ నాగేశ్వర్ కేసు విచారణను అధికారులు వేగవంతం చేశారు. 10 రోజులు పోలీస్ కస్టడీ కోరుతూ వనస్థలిపురం పోలీసులు పిటిషన్ దాఖలు చేశారు. సీఐ నాగేశ్వరరావుపై వస్తున్న ఆరోపణలు, రేప్, కిడ్నాప్ కేసుపై పోలీసులు విచారణ చేయనున్నారు. కస్టడీకి తీసుకున్న తరువాత సీఐని నేర స్థలానికి తీసుకెళ్లి పోలీసులు సీన్ రీ కన్‌స్ట్రక్షన్ చేయనున్నారు. ఇప్పటికే బాధిత మహిళ, భర్తతో పోలీసులు సీన్ రీ కన్‌స్ట్రక్షన్ చేశారు. వనస్థలిపురం నివాసం నుంచి ఇబ్రహీంపట్నం ప్రమాదం జరిగిన వరకు అణువణువు క్షుణ్ణంగా పరిశీలించారు. ఇబ్రహీంపట్నం చెరువులో నాగేశ్వర్ ఫోన్‌లు పడేసిన ప్రాంతాన్ని బాధితుడితో కలిసి పరిశీలించారు. ఇప్పటికే కీలక ఆధారాలు సేకరించారు. FSL నివేదిక, సీసీ టీవీ పుటేజ్ కీలకం కానున్నాయి. బాధితురాలికి మరోసారి పోలీసులు వైద్య పరీక్షలు నిర్వహించనున్నారు.



Updated Date - 2022-07-14T20:05:55+05:30 IST