నల్గొండ డీటీసీలో సీఐ సస్పెన్షన్

Published: Tue, 30 Nov 2021 21:21:03 ISTfb-iconwhatsapp-icontwitter-icon
నల్గొండ డీటీసీలో సీఐ సస్పెన్షన్

నల్గొండ: జిల్లాలోని డీటీసీలో పనిచేస్తున్న సీఐ పరశురామ్‌పై సస్పెన్షన్ వేటు పడింది. కొండమల్లేపల్లి సీఐగా పనిచేస్తున్న సమయంలో నిందితులను వదిలేసి అమాయకులపై సీఐ కేసు నమోదు చేశారు. దీనిపై పోలీస్ ఉన్నతాధికారులకు భాదితులు ఫిర్యాదు చేశారు. ఈ ఘటనపై విచారణ చేసి సీఐ పరశురాంను సస్పెండ్ చేస్తూ  ఐజీ ఉత్తర్వులు జారీ చేశారు. మరో ఘటనలో  జిల్లాలో ఇద్దరు సీఐలపై వేటు పడిన సంగతి తెలిసిందే. వీరిపై అవినీతి ఆరోపణలు వచ్చాయి. ఈ నేపథ్యంలో ఉన్నతాధికారులు విచారణ జరిపారు. దీని ఆధారంగా హాలియా సీఐ వీర రాఘవులు, డిండి సీఐ వెంకటేశ్వర్లుపై ఉన్నతాధికారులు చర్యలు తీసుకున్నారు. వీరిని వీఆర్‌కు బదిలీ చేస్తూ పోలీసు ఉన్నతాధికారులు ఉత్తర్వులు జారీ చేశారు. Follow Us on:
ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.