లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన సీఐ

ABN , First Publish Date - 2020-10-13T07:00:32+05:30 IST

బాన్సువాడ సర్కిల్‌ పరిధి లోని రూరల్‌ సీఐ టాటాబాబు సోమవారం రాత్రి ఏసీబీ చేతికి చిక్కారు. ఏసీబీ డీఎస్పీ రవిశంకర్‌

లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన సీఐ

బాన్సువాడ టౌన్‌, అక్టోబర్‌ 12: బాన్సువాడ సర్కిల్‌ పరిధి లోని రూరల్‌ సీఐ టాటాబాబు సోమవారం రాత్రి ఏసీబీ చేతికి చిక్కారు. ఏసీబీ డీఎస్పీ రవిశంకర్‌ తెలిపిన వివరాల ప్రకారం.. నస్రుల్లాబాద్‌ మండలానికి చెందిన కాంట్రాక్టర్‌ ప్రతాప్‌ సింగ్‌ మరో కాంట్రాక్టర్‌ అడుసుమెల్లి శివప్రసాద్‌ మధ్యలో వాటర్‌ ట్యాంకుల నిర్మాణానికి ఒప్పందం కుదిరింది. బిల్లుల విషయమై వీరిద్దరి మధ్య గతంలో గొడవ జరిగింది. ప్రతాప్‌ సింగ్‌ శివ ప్ర సాద్‌కు డబ్బులు చెల్లించాల్సి ఉండగా, చెక్కును అందజేశారు. కాగా, ఆ చెక్కును బ్యాంకు డిపాజిట్‌ చేసిన తర్వాత ఆ అకౌం ట్‌లో డబ్బులు లేకపోవడంతో చెక్కు బౌన్స్‌ అయ్యింది. దీంతో శివప్రసాద్‌ ఫిర్యాదు మేరకు ఆగస్టు 21వ తేదీన నస్రుల్లాబాద్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో ప్రతాప్‌ సింగ్‌పై చెక్‌ బౌన్స్‌ కేసు నమోదైంది. ఈ కేసులో తనను అరెస్టు చేయవద్దని ప్రతాప్‌సింగ్‌ బాన్సువాడ రూరల్‌ సీఐ టాటాబాబుతో ఇతరుల ద్వారా ఆశ్రయించాడు. దీని కోసం రూ. 50 వేలు ఇ వ్వాలని బాన్సువాడ రూరల్‌ సీఐ డిమాండ్‌ చేశాడు. అంత మొత్తంలో సమకూర్చలేనని ప్రతాప్‌ సింగ్‌ చెప్పడంతో రూ.20 వేలకు ఒ ప్పందం కుదుర్చుకున్నాడు. ఇందులో భాగం గా మొదటి విడతగా రూ.10 వేలను అందజే శాడు. మరో రూ.10 వేలను అందజేసే ముం దు ప్రతాప్‌ సింగ్‌ ఏబీసీ అధికారులను ఆశ్ర యించాడు. సమాచారం మేరకు  సోమవారం రాత్రి సీఐ అద్దె గృహంలో రెండోవిడత రూ.10 వేలను అందజేస్తుండగా, ఏసీబీ అధికారులు దాడులు చేసి ప ట్టుకున్నారు.


కావాలని కేసులో ఇరికించారు : రూరల్‌ సీఐ

కాంట్రాక్టర్‌ ప్రతాప్‌ సింగ్‌ కావాలనే తనను కేసులో ఇరికిం చాడని రూరల్‌ సీఐ తెలిపారు. ఎలాంటి రుసుము తీసుకోలేదన్నారు. సోమవారం రాత్రి డబ్బులు చేతికి ఇవ్వలేదని, కేసు వి షయమై మాట్లాడుదామని ఇంటికి వచ్చిన ప్రతాప్‌సింగ్‌ను కా ర్యాలయానికి రమ్మని సూచించానని తెలిపారు. అయినా ఇంట్లో టీవీ దగ్గర డబ్బులు పెట్టిన విషయం చూడలేదని, ప్రతాప్‌ సిం గ్‌కు మధ్య ఎలాంటి లావాదేవీలు జరుగలేదని అన్నారు.

Updated Date - 2020-10-13T07:00:32+05:30 IST